చిరంజీవి, వైజయంతీ అధినేత అశ్వనీదత్ కాంబినేషన‌లోని సినిమాలు ఇవే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్, హీరో చిరంజీవి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో మొదటిసారి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రీదేవి నటించింది.కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో ‘చూడాలని వుంది, ఇంద్ర, జై చిరంజీవా’ సినిమాలు తెరకెక్కాయి. అందులో చూడాలని వుంది చిత్రం సూపర్ హిట్‌గా నిలిస్తే.. ఇంద్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత వీళ్ల కలయికలో చూడాలనివుంది, ఇండ్ర సినిమాలు వచ్చాయి. చివరగా వీళ్ల కలయికలో వచ్చిన ‘జై చిరంజీవా’ చిత్రం మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది.