వీరసింహారెడ్డి సినిమా గత నెల జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ గా ఒక రోజు గ్యాప్‌లో జనవరి 13న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ పోటీలో ఇద్దరి సినిమాలు విజయాలు సాధించాయి. కానీ ఈ పోటీలో బాలకృష్ణ పై చిరంజీవి ఒకింత పై చేయి సాధించారనే చెప్పాలి. వీళ్లిద్దరు పొంగల్ కాకుండా పలు సందర్భాల్లో పోటీ పడ్డారు. ఇక వీళ్లిద్దరు సంక్రాంతి బరిలో ఎన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారంటే.. (Twitter
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు ఒక రోజు గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తూ సంక్రాంతి జూదానికి రెడీ అయింది. ఈ రెండు సినిమాల్లో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. (File/Photo)
రెండు సినిమాలపై కాన్ఫిడెన్స్‌తోనే మైత్రీ మూవీ మేకర్స్ సంక్రాంతి బరిలో ఇద్దరు లెజండరీ హీరోలతో పందానికి సై అంటూ బరిలో దిగింది. ఇప్పటి వరకు 19 సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డ బాలయ్య, చిరంజీవి.. సంక్రాంతి బరిలో మాత్రం 10 సార్లు పోటీ పడ్డారు. ఇపుడు 11వ సారి పొంగల్ పోటీలో ఒక రోజు గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. (Twitter/Photo)
1.ఆత్మ బలం - చట్టంతో పోరాటం | 1985ల చిరంజీవి ‘‘చట్టంతో పోరాటం’’ మూవీతో జనవరి 5న పలకరించారు. ఆ తర్వాత ఒక వారం గ్యాప్‌లో 11 జనవరిన బాలకృష్ణ ‘‘ఆత్మబలం’’ సినిమాతో ఢీ కొట్టినుండే. ఇక సంక్రాంతి సీజన్లో పోటీ పడటం ఫస్ట్ టైం. ఓవరాల్‌గా మాత్రం 5వ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. ఈ పోటీలో చిరు చట్టంతో పోరాటం హిట్‌గా నిలిస్తే.. బాలయ్య ‘ఆత్మ బలం’ మూవీ మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సారి బాలయ్య మీద చిరునే పై చేయి సాధించారు.
2. దొంగ మొగుడు - భార్గవ రాముడు |1987 సంక్రాంతి సీజన్లో వన్ వీక్ గ్యాప్ లో చిరుంజీవి 7 జనవరి రోజున ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘దొంగమొగుడు’ మూవీతో పలకరించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అటు బాలకృష్ణ జనవరి 14న ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘భార్గవ రాముడు’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఒక దర్శకుడి డైరెక్షన్లో వీళ్లిద్దరు నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక సంక్రాంతి సీజన్లో వీళ్లిద్దరు పోటీ పడ్డ రెండో చిత్రం. (Twitter/Photo)
3.మంచి దొంగ - ఇన్స్పెక్టర్ ప్రతాప్ | 14 జనవరి 1988లో చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచిదొంగ గా మురిపిస్తే..బాలకృష్ణ ఒక రోజు గ్యాప్‌లో 15 జనవరి 1988న ‘ఇన్ స్పెక్టర్ ప్రతాప్’ గా పలకరించారు. ఇందులో చిరంజీవి మంచి దొంగగా హిట్ అందుకున్నారు.. మరోవైపు బాలయ్య.. ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఈ సారి పోటీలో బాలయ్యపై చిరు కొంచెం పై చేయి సాధించారు.సంక్రాంతి బరిలో నాల్గోసారి నిలవడం విశేషం. (File/Photo)
4. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు - భలే దొంగ | 1989లో ఆ తర్వాతి సంక్రాంతికి బాలయ్య భలేదొంగగా జనవరి 15న పలకరిస్తే.. మురిపిస్తే...చిరు మాత్రం జనవరి 14 ‘‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’’గా మెప్పించారు. ఇందులో చిరు.. అత్తకు యుముడు అమ్మాయికి మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిస్తే.. బాలయ్య ‘భలే దొంగ’గా మురిపించారు. ఈ సారి పోటీలో ఇద్దరికీ సక్సెస్ అందుకున్నా.. బాలయ్యపై చిరు ఒకింత పై చేయి సాధించారనే చెప్పాలి. సంక్రాంతి బరిలో 4వ సారి పోటీలో నిలబడటం విశేషం. (File/Photo)
5. పెద్దన్నయ్య - హిట్లర్ | 5వ సారి సంక్రాంతి బరి విషయానికొస్తే.. 1997 సంక్రాంతి సీజన్లో చిరంజీవి.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో జనవరి 4 పలకరించారు. అటు ఈ సినిమా విడుదలైన వారం గ్యాప్‌లో జనవరి 10న శరత్ దర్శకత్వంలో ‘పెద్దన్నయ్య’ గా పలకరించారు. ఇందులో చిరంజీవి ‘హిట్లర్’గా హిట్ అందుకున్నారు. అటు పెద్దన్నయ్యగా సక్సెస్ అందుకున్నారు. ఈ సారి పోటీలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు సక్సెస్ అందుకున్నారు. (File/Photo)
6.సమరసింహారెడ్డి - స్నేహం కోసం | 1999 జనవరి 1న కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చిరంజీవి ‘స్నేహం కోసం’ మూవీతో పలకరించారు. ఈ మూవీ బాక్సాపీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. మరోవైపు రెండు వారాల గ్యాప్‌లో సంక్రాంతి కానుకగా జనవరి 13న బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘సమరసింహారెడ్డి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సారి పోటీలో చిరంజీవిపై బాలయ్య పై సాధించారు. ఇది 6వ సారి సంక్రాంతి బరిలో నిలవడం. (File/Photo)
7.అన్నయ్య - వంశోద్ధారకుడు | 2000 జనవరి 4న చిరంజీవి.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘అన్నయ్య’గా ఆకట్టుకున్నారు. మరోవైపు 10 రోజుల గ్యాప్‌తో బాలయ్య జనవరి 14న శరత్ దర్శశకత్వంలో ‘వంశోద్దారకుడు’ తో పలకరించారు. ఈ సారి పోటీలో అన్నయ్యగా చిరంజీవి హిట్ అందుకుంటే.. బాలయ్య.. ‘వంశోద్దారకుడు’ మూవీతో ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఈ సారి పోటీలో బాలకృష్ణపై చిరంజీవి పై చేయి సాధించారు. ఇది 7వ సారి పొంగల్ పోటీలో నిలిచారు. (File/Photo)
8. మృగరాజు - నరసింహనాయుడు | 2001లో జనవరి 11న మెగాస్టార్ చిరంజీవి.. గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన ‘మృగరాజు’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిస్తే.. అదే రోజు విడుదలైన బాలకృష్ణ, బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నరసింహనాయుడు’ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సారి పోటీలో చిరంజీవిపై బాలకృష్ణ పై చేయి సాధించారు. ఇది 8వ సారి సంక్రాంతి బరిలో నిలిచారు. (File/Photo)
9. లక్ష్మీ నరసింహా - అంజి | నందమూరి బాలకృష్ణ.. 2004లో సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘లక్ష్మీ నరసింహా’ మూవీతో పలకరించి హిట్ అందుకున్నారు. మరోవైపు ఒక రోజు గ్యాప్‌లో చిరంజీవి హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంజి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సారి మాత్రం మెగాస్టార్ పై నట సింహం పై చేయి సాధించారు. 9వ సారి పోటీ పడటం విశేషం. (File/Photo)
10.ఖైదీ నంబర్ 150 - గౌతమిపుత్ర శాతకర్ణి | మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘ఖైదీ నంబర్ 150’ . 11 జనవరి 2017న విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మరోవైపు 12 జనవరిన క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్పాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు సూపర్ హిట్స్ అందుకున్నారు. 10వ సారి సంక్రాంతి బరిలో ఇద్దరు విజయం అందుకున్నారు. (File/Photo)
11.వీర సింహా రెడ్డి Vs వాల్తేరు వీరయ్య | ఇక చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తోన్న వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో జనవరి 13న విడుదలయ్యాయి.. మరో పక్క బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి సినిమాను ఒక రోజు ముందుగా జనవరి 12న సంక్రాంతికి విడుదలైంది. (Twitter/Photo)
టాకీస్ల దగ్గర ప్రేక్షకుల సందడి, అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. ఎవరు హిట్ కొడతారు.. ? ఎవరు బొక్క బోర్లా పడ్డారు ? వంటి టాక్ తో అదో రకమైన హడావుడి ఉంటుంది. ఈసారి కూడా అదే సందడి రిపీటైంది. ఇందులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ దగ్గర రూ. 135 కోట్ల షేర్ (రూ. 230 కోట్ల) గ్రాస్ వసూళ్లను సాధించింది. అటు బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి ‘రూ. 80 కోట్ల షేర్ ( రూ. 145 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.దాదాపు ీ రెండు సినిమాల థియేట్రికల్ రన్ ముగిసిందనే చెప్పాలి. (File/Photo)