CHIRANJEEVI VIJAYASHANTI HIT PAIR IN TOLLYWOOD THESE ARE THE FILMS LIST TA
Chiranjeevi: చిరంజీవి,విజయశాంతి జోడిగా నటించిన సినిమాలు ఇవే..
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, విజయశాంతి జోడికి భలే క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు కలిసి 19 సినిమాల్లో జోడిగా కలిసి నటించారు.తాజాగా వీళ్లిద్దరు మరోసారి జోడి కట్టబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి, విజయశాంతి జోడిగా 19 సినిమాల్లో కలిసి నటించారు. (Facebook/Photo)
2/ 21
తొలిసారి చిరు, విజయశాంతిలు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన ‘సంఘర్షణ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Facebook/Photo)
3/ 21
రెండోసారి ‘దేవాంతకుడు’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. (Youtube/Photo)
4/ 21
చిరు,విజయశాంతి జోడిగా నటించగా.. విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానగరంలో మాయగాడు’ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. (Youtube/Photo)
5/ 21
చిరంజీవి,విజయశాంతి జంటగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కే.యస్.రామారావు నిర్మించిన ‘చాలెంజ్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. (Youtube/Photo)
6/ 21
తన సొంత పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.(Youtube/Photo)
7/ 21
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు, విజయశాంతి, రాధలు నటించిన ‘కొండవీటి రాజా’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Youtube/Photo)
8/ 21
లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో చిరు,విజయశాంతి జోడిగా నటించిన ‘ధైర్యవంతుడు’ సినిమా బాక్పాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. (Youtube/Photo)
9/ 21
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి,విజయశాంతి జోడిగా నటించిన ‘చాణక్య శపథం’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Youtube/Photo)
10/ 21
చిరంజీవి,విజయశాంతి జోడిగా నటించిన ‘పసివాడి ప్రాణం’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో చిరు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. (Youtube/Photo)
11/ 21
కళా తపస్వీ కే.విశ్వనాథ్ దర్వకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరో,హీరోయిన్లుగా నటించిన ‘స్వయంకృషి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయంతో పాటు నటుడిగా చిరుకు ఉత్తమ నటుడిగా మొదటి నందిని తీసుకొచ్చింది. (Youtube/Photo)
12/ 21
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు,విజయశాంతి, సుహాసినిలు నటించిన ‘మంచి దొంగ’ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. (Youtube/Photo)
13/ 21
చిరంజీవి, విజయశాంతి జోడిగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యముడికి మొగుడు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైయింది. (Youtube/Photo)
14/ 21
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు,విజయశాంతి జోడిగా నటించిన ‘యుద్ధభూమి’ బాక్సాఫీస్ యుద్దంలో పరాజయం పాలైంది. (Youtube/Photo)
15/ 21
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరు,విజయశాంతి జోడిగా నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. (Youtube/Photo)
16/ 21
కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరు, విజయశాంతి,రాధ నటించిన ‘రుద్రనేత్ర’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. (Youtube/Photo)
17/ 21
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి,విజయశాంతి,రాధలు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. (Youtube/Photo)
18/ 21
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి,విజయశాంతి, నిరోషా నటించిన ‘స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాపైంది. (Youtube/Photo)
19/ 21
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి,విజయశాంతి హీరో,హీరోయిన్లుగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొంది. (Youtube/Photo)
20/ 21
చిరంజీవి,విజయశాంతి జోడిగా నటించిన చివరి సినిమా ‘మెకానిక్ అల్లుడు’. బి.గోపాల్ దర్శకత్వంలో అల్లు అరవింద్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ మూటకట్టుకుంది. (facebook/photo)
21/ 21
తాజాగా చిరంజీవి,విజయశాంతి కొరటాల శివ దర్శకత్వంలో జోడిగా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.(twitter/Photo)