Chiranjeevi - Unstoppalbe With NBK: బాలయ్య అన్స్టాపబుల్కు కాకుండా.. స్మిత షోకు చిరంజీవి ఎందుకు వెళ్లారనేది ఇపుడు మెగాభిమానులను వేధిస్తోన్న ప్రశ్న. నిజంగా చిరంజీవికి అల్లు అరవింద్ మధ్య ఏమైనా విభేదాలున్నాయా .. ? లేకపోతే బాలయ్యతో ఈగో క్లాషెస్ ఈ షోకు వెళ్లకుండా చిరును అడ్డుకున్నాయా ? బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ షో కాదని సుమ హోస్ట్ చేస్తోన్న సుమ అడ్డాతో పాటు తాజాగా సింగర్ స్మిత సోనీ లివ్‌లో చేస్తోన్న ప్రోగ్రామ్‌కు చిరు గెస్ట్‌గా వెళ్లారు.
అంతకు ముందు తన బామ్మర్ధి అల్లు అరవింద్‌కు చెంది ఆహాలో సమంత హోస్ట్‌గా వ్యవహరించిన ‘సామ్ జామ్’లో చిరంజీవి పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సమంత, సుమ, స్మిత వంటి వాళ్లు హోస్ట్ చేసిన ప్రోగ్రామ్‌కు చిరంజీవి గెస్ట్‌గా వెళ్లినా.. తన తోటి హీరో కమ్ ప్రత్యర్ధి బాలకృష్ణ షోకు చిరు రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని మెగాభిమానులతో పాటు నందమూరి ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తూనే ఉన్నారు. ఇక గత నాలుగు దశాబ్ధాలుగా చిరు, బాలయ్యలు బాక్సాఫీస్ దగ్గర ప్రత్యర్ధులుగా తలపడుతూనే ఉన్నారు.(Twitter/Photo)
అపుడెపుడో 80ల నుంచి రీసెంట్గా ఈ సంక్రాంతి వరకు వీళ్లిద్దరు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అన్నారు. 2023 సంక్రాంతి బరిలో బాలకృష్ణ.. వీరసింహారెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తే.. చిరంజీవి.. వాల్తేరు వీరయ్యగా అభిమానులకు పూనకాలు తెప్పించారు. ఐతే.. ఈ పోటీలో బాలయ్య సినిమా కంటే చిరు సినిమానే పై చేయి సాధించింది. బాలయ్య సినిమా వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుంటే.. చిరు సినిమా ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఇక చిరంజీవి, బాలకృష్ణ మధ్య స్నేహం కూడా ఉంది. ఇక బాలయ్య కూడా తనకు ఇండస్ట్రీలో చిరు మంచి మిత్రుడు అని పలు సందర్భాల్లో చెప్పారు. ఇక చిరు కూడా బాలయ్య అంటే అంతే అభిమానం ఉంది. సినిమాల విషయంలో వీళ్ల అభిమానులు సోషల్ మీడియాలో చొక్కాలు చించుకున్న బయట మాత్రం చిరు, బాలయ్యలు మంచి స్నేహితులుగానే ఉన్నారు. అపుడుపుడు బాలయ్య మాత్రం తన సినిమాలు ఇతరత్ర వేదికలపై చిరు ఫ్యామిలీపై ఎటాక్ చేసిన సందర్భాలున్నాయి. చిరు మాత్రం బాలయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం అని కొట్టి పారేసిన సందర్భాలున్నాయి. (Twitter/Photo)
చిరంజీవికి తన బామ్మర్ధి అల్లు అరవింద్‌కు సరిగా పడటం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక చిరు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏమి అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌లో చేయలేదు. అదే సమయంలో సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్‌ను తన కుమారుడు రామ్ చరణ్‌తో స్టార్ట్ చేసి వరుసగా ఆ బ్యానర్లోనే చేసాడు.
అటు అల్లు అరవింద్ కూడా తన ఆహా ఓటీటీలో చిరుతో కాకుండా.. బాలయ్యతో టాక్ షో చేయడం హైలెట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు చిరు ఫ్యామిలీకి మెంబర్‌గా ఉన్న అల్లు అరవింద్ .. బాలయ్యకు దగ్గరయ్యారు. ఈ సందర్భంగా చిరు కంటే ముందే ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య కాలం నుంచే నందమూరి, అల్లు ఫ్యామిలీల మధ్య రిలేషన్ ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.
ఇక సెకండ్ సీజన్ గ్రాండ్ ఫినాలేకు మెగా ఫ్యామిలీ (కొణిదెల) నుంచి పవన్ కళ్యాణ్ ఛీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇప్పటికే ప్రసారమైన గ్రాండ్ ఫినాలే ఫస్ట్ ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు సెకండ్ ఎపిసోడ్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ పై మెగా, నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. (Twitter/Photo)
.తాజాగా ఈ షోలో చిరంజీవి పాల్గొనే విషయమై క్లారిటీ ఇచ్చారు బాలయ్య. చిరంజీవితో పాటు వెంకటేష్, నాగార్జునతో కూడా తన టాక్ షో ఉంటుందని వెల్లడించారు. వాళ్ల సమయానికి అనుగుణంగా ఈ షోలో వాళ్లు పాల్గొనేలా చేయడంలో ఆహా టీమ్ వర్క్ చేస్తుందని చెప్పారు. వాళ్లతో టాక్ షో కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
అటు చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య ప్రమోషన్లో భాగంగా తనకు ఆహా టీమ్ నుంచి ఆహ్వానం అందలేదని చెప్పారు. ఒక అందితే తప్పకుండా వెళతాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఒకప్పటిలా చిరంజీవి.. ప్రజలతో ఇంట్రాక్ట్ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సమంత, సుమ, ఇపుడు స్మిత టాక్ షోల్లో పాల్గొన్నారు. (Photo Twitter)
ఇక బాలయ్య నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 3 కోసం చిరంజీవిని ఇప్పటికే అల్లు అరవింద్ రిజర్వ్ చేసి పెట్టినట్టు సమాచారం. అటు చిరుతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో పాటు వెంకటేష్, నాగార్జునలు కూడా సీజన్లో బాలయ్య కలిసి సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆహా షో స్క్రీన్ ప్లేలో భాగంగా వీరంత సీజన్ 3లో కనిపించే అవకాశాలు కొట్టిపారేయలేము. బహుశా అల్లు అరవింద్ ప్లాన్ అదే కావొచ్చేమో. ఏది ఏమైనా బాలయ్య, చిరును ఒకే ఫ్రేములో చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పటికే బాలయ్య, పవన్ కళ్యాణ్‌లను చూసి మురిసిపోతున్న అభిమానులు.. త్వరలో చిరు, బాలయ్య లు ఒకే ఫ్రేములో చూడాలని ఉబలాట పడుతున్నారు. వారి కోరిక నెరవేరాలంటే నెక్ట్స్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే. (Twitter/Photo)