తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. మెహర్ రమేశ్ (Mehar Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరత్వరగా షూటింగ్ పనులు పూర్తి చేసి ఈ సినిమాను మే 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.