Chiranjeevi Top Disaster Movies : మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తెలుగులో సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్,కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తర్వాత స్వయంకృషితో తన కంటూ ఒక సామ్రాజ్యాన్నే ఏర్పరుచుకున్నారు. ఈయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్‌తో పాటు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ తరంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించిన ఘనత చిరంజీవిదే. ఈయన కెరీర్లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు అదే రేంజ్లో డిజాస్టర్స్ మూవీస్ ఉన్నాయి. తాజాగా ఆచార్య మూవీతో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో డిజాస్టర్ మూవీ చేరింది. మొత్తంగా చిరు కెరీర్లో డిజాస్టర్స్‌గా నిలిచిన సినిమాలేంటో చూద్దాం..
ఆచార్య | మెగా తండ్రీ తనయులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పూర్తి స్థాయిలో తొలిసారి నటించిన ’ఆచార్య’ మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉండటంతో మెగాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మెగా క్రౌడ్ పుల్లర్ హీరోలున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచింది. ఓవరాల్‌గా నిర్మాతలకు ఈ సినిమా రూ. 80 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశాలున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆచార్య కంటే ముందు చిరు కెరీర్లో ఉన్న డిజాస్టర్ మూవీస్ ఏవేవి ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి.. (Twitter/Photo)
శంకర్ దాదా జిందాబాద్ | హిందీలో సంజయ్ దత్ హీరోగా హిట్టైన ‘లగేరహో మున్నాభాయ్’ సినిమాను తెలుగులో చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’గా రీమేక్ చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. (File/Photo)
SP పరశురాం | మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన పదకొండో చిత్రం ‘SP పరశురాం’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, జీకే రెడ్డి, ముఖేష్ ఉదేషితో కలిసి సంయుక్తంగా తెరకెక్కించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘వాల్డర్ వెట్రివెల్’ చిత్రానికి రీమేక్. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తర్వాత చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Youtube/Credit)
స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్ | చిరంజీవి, నిర్మాత కే.యస్.రామారావు కలయికలో వచ్చిన ఐదో చిత్రం ‘స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్’. ఈ చిత్రాన్ని రచయత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతి, నిరోషా కథానాయికలుగా నటించారు. (Youtube/Credit)
త్రినేత్రుడు | చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన చిత్రం ‘తినేత్రుడు’. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన 2వ చిత్రం . ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. హీరోగా చిరంజీవి 100వ చిత్రం. (Youtube/Credit)
ఆరాధన | మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘ఆరాధన’. భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘కడలోరా కవితైగల్’ చిత్రానికి రీమేక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రాధిక, సుహాసిని హీరోయిన్స్‌గా నటించారు. రాజశేఖర్ మరో ముఖ్యపాత్రలో నటించారు. (Youtube/Credit)
హీరో | మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘హీరో’. ఈ చిత్రం హాలీవుడ్లో హిట్టైన ‘ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ మూవీని తెలుగులో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Youtube/Credit)
మొత్తంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో హిట్ సినిమాలతో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో చంటబ్బాయి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలకు టాక్ బాగున్నా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. మొత్తంగా చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు అభిమానులను నిరాశ పరిచిన చిత్రాలకు కూడా కొదవలేదు. (Twitter/Photo)