ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి, అబ్బాయి రామ్ చరణ్ రూట్లో తొలిసారి చారిత్రక పాత్రలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కొంచెం జరిగింది. త్వరలోనే మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర నిర్మాతలు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి చారిత్రక చిత్రం కావడం విశేషం. (Twitter/Photo)
రామ్ చరణ్.. చారిత్రక యోధుడైన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్లో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఓ రేంజ్లో ఇరగదీసాడు. ఈ చిత్రం ఎన్నో రిలీజ్ డేట్స్ తర్వాత ఎట్టకేలకు మార్చి 25న విడుదల కానుంది. ఈ సినిమా కూడా ఇద్దరు చారిత్రక యోధులను పెట్టుకుని తెరకెక్కించిన కాల్పనిక సినిమా పూర్తి స్థాయి హిస్టారికల్ అని చెప్పలేము. అంతకు ముందు రామ్ చరణ్.. ‘మగధీర’లో కొంచెం సోషియో ఫాంటసీ నేపథ్యంలో కాల్పనిక చారిత్రక చిత్రంలో నటించారు. (Twitter/Photo)
అటు చిరంజీవి, రామ్ చరణ్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న ‘హరి హర వీరమల్లు’ కూడా చారిత్రక యోధుడు పాత్రను చేస్తున్నాడు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో ఫస్ట్ టైమ్ చారిత్రక పాత్ర చేస్తోన్న సినిమా ఇదే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తోన్న తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. (Twitter/Photo)