చిరంజీవి ఇపుడు బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో చేయబోయే *వాల్తేరు వీరయ్య’ సినిమాలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఇపుడు చిరు బాటలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం.(Chiranjeevi Bobby)
పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన ఫిల్మ్ కెరీర్లో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేయలేదు. కానీ ఇపుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు సమాచారం. అందులో ఒకటి లెక్చరర్ పాత్ర అయితే.. మరొకటి ఐబీ ఆఫీసర్ క్యారెక్టర్ అని చెబుతున్నారు. (Twitter/Photo)