Brahmanandam | బ్రహ్మానందం ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. తన హాస్యంతో తెలుగువారిని అలరించిన బ్రహ్మి ఈరోజు 67వ పడిలోకి అడుగుపెట్టారు. బ్రహ్మానందం కామెడీ టైమింగ్‌తో కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. ఈయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పుష్పగుచ్చంతో పాటు శ్రీవారి విగ్రహాన్ని ఇచ్చి స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలియజేసారు. (Twitter/Photo)
బ్రహ్మానందం విషయానికొస్తే.. ఈయన ఇంటిపేరు కన్నెగంటి బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 లో సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. తెలుగులో మాస్టర్స్ చేసిన బ్రహ్మీ మొదట సినిమాల్లో కాకుండా దూరదర్శన్‌లో వచ్చిన ‘పకపకలు’ ప్రోగ్రామ్‌లో నవ్వులు కురిపించారు. ఆ తర్వతా జంధ్యాల దర్శకత్వంలో ‘అహ నా పెళ్లంట’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ మొదట విడుదలైన మూవీ మాత్రం ‘శ్రీ తాతావతారం’.ఆ తర్వాత ఈయన వెనుదిరిగి చూసుకోలేదు. (Twitter/Photo)
నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్. ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయనక్కర్లేదు. అతని మొహం చూస్తూనే హాస్యం వెల్లివిరిస్తోంది. పొట్టచెక్కలవుతోంది. ఇలాంటి బ్రహ్మానందనాకి హృదయ పూర్వక శుభాభినందనలు తెలియజేసారు.(TwitterPhoto)
ఆ తర్వాత బ్రహ్మానందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ పది మందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మానందంకు మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ తనకి నాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి బ్రహ్మాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (Twitter/Photo)
బ్రహ్మానందం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన హాస్యంతో తెలుగువారిని అలరించారు బ్రహ్మానందం. తనదైన కామెడీ టైమింగ్‌తో కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. సినిమాలో కామెడీ పండించాలంటే బ్రహ్మి ఉండాల్సిందే. అలాంటి ఈయన అతి తక్కువ సమయంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించినందుకు ఈయన 2010లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. దాని కోసం పగలు రాత్రి ఎంతో కష్టపడాల్సి ఉంటోంది. ఈ రోజు బ్రహ్మీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (Twitter/Photo)