CHIRANJEEVI SON IN LAW SUSHMITA KONIDELA HUSBAND VISHNU PRASAD BIRTHDAY CELEBRATIONS TA
Sushmita Konidela: ఘనంగా జరిగిన చిరంజీవి పెద్ద అల్లుడు సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ బర్త్ డే వేడుకలు..
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.. కేవలం చిరంజీవి పెద్ద కూతురుగానే కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్. ఇపుడు సుస్మిత తాను ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్న చదువు తన తండ్రి నటించిన సినిమాలకు బాగానే ఉపయోగపడుతోంది. సుస్మిత తన తండ్రి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. తాజాగా ఈమె భర్త విష్ణు ప్రసాద్ బర్త్ డే వేడుకలు డిసెంబర్ 2న ఘనంగా జరిగాయి. దానికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకలకు కాబోయే దంపతులు నిహారిక, చైతన్య హాజరై విష్ణు ప్రసాద్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసారు.