ఇక మైత్రీ మూవీ మేకర్స్ గురించి చెప్పాలంటే.. చాలా మంచి ప్రొడక్షన్. ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్న ఏకైక ప్రొడక్షన్ ఏదైనా ఉంది అంటే అది మైత్రీ. నా సినిమాతో పాటు వీరసింహారెడ్డి సినిమా కూడా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. డబ్బు లెక్క చూడకుండా సినిమా కోసం ఖర్చు పెట్టడంలో నిర్మాతలు ఎక్కడ తగ్గలేదు. వారికి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు చిరంజీవి.
నాతో ఢీకొట్టేలా ఉండే పాత్రను రవి చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నయ్య సినిమాలో నా తమ్ముడిగా చేసిన రవితేజ.. ఇప్పుడు అంచలంచెలుగా ఎదిగి మాస్ మహారాజా లా ఎదిగాడు అంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. రవితేజ సెట్ లో అస్సలు ఫోకస్ చేసేవాడు కాదు.. ముచ్చట్లు పెట్టేవాడు. తెగ అల్లరివాడు అంటూ చిరు రవితేజపై కామెంట్లు చేశారు.