బ్రహ్మానందం ఇంతటి ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్యమైన పాత్రను పాత్ర చేయడం తొలిసారి. సెకండాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంటతడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించవలసినవి. ఇలాంటి చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాష్ రాజ్ కి, రమ్యకృష్ణకి, చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు అని చిరంజీవి అన్నారు.