Chiranjeevi Remakes | చిరంజీవి తన కెరీర్లో ఎన్నో రీమేక్స్‌లో నటించారు. ఈ రీమేక్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. గతేడాది చిరు చేసిన ‘గాడ్ ఫాదర్’ మూవీ మలయాళంలో హిట్టైన లూసీఫీర్కు రీమేక్. తాజాగా చేస్తోన్న,‘భోళా శంకర్’ సినిమా కూడా వేరే భాషలో హిట్టైన సినిమాకు రీమేక్. మొత్తంగా చిరంజీవి తన కెరీర్లో ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారనే విషయానికొస్తే.. (Twitter/Photo)
‘గాడ్ ఫాదర్’ | మోహన్‌లాల్ ‘లూసీఫర్’ రీమేక్‌లో చిరంజీవి. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. ఇపుడు చిరు.. మోహన్‌లాల్ చేసిన ఈ పాత్రను ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో రీమేక్ చేసారు. ఈ సినిమా గతేడాది దసరా కానుకగా విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో ఆగిపోయింది. (Twitter/Photo)
స్నేహం కోసం | కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చిరంజీవి, విజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన ‘స్నేహం కోసం’ సినిమాను తమిళంలో అదే కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో శరత్ కుమార్, విజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన ‘నట్పుక్కగ’ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)
‘ది జెంటిల్మెన్ | ‘ది జెంటిల్మెన్’ సినిమా హిందీలో మహేష్ భట్ దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రం తమిళంలో శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జెంటిల్మెన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో అదే టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేస్తే.. ఇక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. హిందీలో మాత్రం ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి చిరంజీవి చేదు జ్ఞాపకం మిగిల్చింది. (Twitter/Photo)
ముగ్గురు మొనగాళ్లు | చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభియంలో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా హిందీలో ‘యాదోంకి బారాత్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమా తెలుగులో ‘అన్నదమ్ముల అనుబంధం’గా వచ్చింది. మరోవైపు కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా నటించిన ‘ముగ్గురు కొడుకులు’ సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమా మాత్రం డైరెక్ట్ రీమేక్ కాకపోయినా.. అదే స్టోరీని.. చిరు త్రిపుల్ రోల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. (Twitter/Photo)
మెకానిక్ అల్లుడు | ’మెకానిక్ అల్లుడు’ సినిమా డైరెక్ట్ రీమేక్ కాకపోయినా.. ఏఎన్నార్ హీరోగా శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘శ్రీరంగనీతులు’ సినిమాను కాస్తంత మార్చి అదే ఏఎన్నార్‌తో కలిసి చిరు ‘మెకానిక్ అల్డుడు’ గా తీశారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్ | యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
పసివాడి ప్రాణం | ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (Twitter/Photo)
దొంగ మొగుడు | ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
చట్టానికి కళ్లులేవు | చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్ర శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చట్టానికి కళ్లులేవు’ సినిమా.. తమిళంలో ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని నమోదు చేసింది. (Twitter/Photo)
47 రోజులు | కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘47 రోజులు’ సినిమాను ఒకేసారి తమిళంలో తెలుుగలో తెరకెక్కించారు. తమిళంలో 47 నాట్కల్’ మూవీతో తెరకెక్కితే.. తెలుగులో 47 రోజులు పేరుతో తెరకెక్కింది. ఈ చిత్రంతో చిరు.. తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. (Twitter/Photo)
మొగుడు కావాలి | చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మొగుడు కావాలి’ సినిమా హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘మంచలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఇదే సినిమా కాన్సెప్ట్‌తో సాయి ధరమ్ తేజ్.. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాను తెరకెక్కించారు. (Twitter/Photo)
ప్రేమ తరంగాలు | ’ప్రేమ తరంగాలు’ సినిమా హిందీలో అమితాబ్, వినోద్ ఖన్నా హీరోలుగా తెరకెక్కిన ‘ముఖద్దర్ కా సికందర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు నటిస్తే.. వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. (Twitter/Photo)
ఇద కథ కాదు | కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఇది కథ కాదు’ సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అవర్గళ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్లో మెప్పించారు. (Twitter/Photo)
మొత్తంగా చిరంజీవి తన కెరీర్లో 50 వరకు రీమేక్ చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువ సినిమాలు చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్‌తో పాటు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మొత్తంగా రీమేక్ సినిమాలు హీరోగా చిరంజీవి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. రాబోయే ‘భోళా శంకర్’ సినిమా హిట్ సాధిస్తుందనే నమ్మకం అభిమానులకు ఉంది.( Chiranjeevi Photo : Twitter)