Chiranjeevi - Ram Charan | NTR - NBK : ఎన్టీఆర్, బాలకృష్ణ టూ చిరంజీవి, రామ్ చరణ్ కాకుండా.. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, కృష్ణ, మహేష్ బాబు వంటి హీరోలు నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. మొత్తంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిన తండ్రీ తనయుల కాంబినేషన్లో వచ్చిన సినిమాలేమిటో చూద్దాం.. (File/Photos)'
NTR - NBK | తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన పలు సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి. ఇక ప్రేక్షకులను నిరాశ పరిచిన సినిమాల్లో ‘అక్బర్ సలీం అనార్కలి ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ANR - Nagarjuna | అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున కలయికలో వచ్చిన రెండో చిత్రం ‘అగ్నిపుత్రుడు. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అలాగే అక్కినేని తండ్రీ తనయులైన ఏఎన్నార్, నాగార్జున కలయికలో వచ్చిన ఇద్దరూ ఇద్దరే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ బాబు | మహేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా మారిన తర్వాత తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘వంశీ’ సినిమాలో కలిసి యాక్ట్ చేసారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన టక్కరి దొంగ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ | మంచు మోహన్ బాబు, తన తనయులైన మంచు విష్ణుతో కలిసి నటించిన ‘సూర్యం’, గేమ్, గాయత్రి’ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. అటు మనోజ్‌తో కలిసి నటించిన శ్రీ, ఝుమ్మంది నాదం సినిమాలు కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇక మంచు మోహన్ బాబు హీరోగా నటించిన పొలిటికల్ రౌడీ సినిమాలో విష్ణు, మనోజ్ అతిథి పాత్రల్లో మెరిసారు. ఈ చిత్రం కూడా బాక్పాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇక వీళ్ల ముగ్గురు కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ మూవీ మాత్రం పర్వాలేదనిపించింది. (Twitter/Photo)
కృష్ణంరాజు - ప్రభాస్ | రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ ఫ్యామిలీ విషయానికొస్తే.. ఈ పెద్దనాన్న కొడుకులు కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ చిత్రాల్లో నటించినా.. నిజ జీవిత పాత్రల్లో మాత్రం నటించలేదు. తాజాగా వీళ్లిద్దరు ‘రాధే శ్యామ్’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.
చిరంజీవి - రామ్ చరణ్ | మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన మూవీ ‘ఆచార్య’. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు మెగాభిమానులను సైతం నిరాశ పరిచింది. ఈ సినిమా కంటే ముందు వీళ్లిద్దరు కలిసి నటించిన ‘బ్రూస్లీ’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Acharya/Twitter)