ఒక బడా స్టార్ హీరో సినిమా వస్తే అభిమానులు ఆనందానికి అవధులు ఉండవు. అదే ఇద్దరు బడా స్టార్ హీరోలు ఒక మూవీలో యాక్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటోంది. తాజాగా ఆచార్య మూవీలో మెగా తండ్రీ తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. అలా ఇద్దరు స్టార్ హీరోలు నటించగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన సినిమాలేవో చూద్దాం.. (Twitter/Photo)
మెగా తండ్రీ తనయులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పూర్తి స్థాయిలో తొలిసారి నటించిన ’ఆచార్య’ మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. క్రౌడ్ పుల్లర్స్ వంటి స్టార్స్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
రామ కృష్ణులు | నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా జగపతి వి. రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రామకృష్ణులు’. ఈ సినిమా హిందీలో అమితాబ్, వినోద్ ఖన్నాల ‘హేరా ఫేరి’ సినిమాను కాస్త మార్చి తెరకెక్కించారు. ఇద్దరు బడా స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీ అనుకున్నంత రేంజ్లో మెప్పించ లేకపోయింది. (File/Photo)