తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్‌కు కొదవలేదు. ఇక్కడ చాలా మంది దర్శకులు సత్తా చూపిస్తున్నారు. అయినా కూడా పరభాషా దర్శకులు తెలుగులో ఉనికి నిలుపుకుంటున్నారు. అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చి అవకాశాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలు చాలా మంది వాళ్లకు పిలిచి మరీ ఆఫర్ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో చాలామంది స్టార్ హీరోలు పరభాషా దర్శకులతో తొలిసారి జోడీ కట్టబోతున్నారు. మరి వాళ్లెవరు.. ఏంటా సినిమాలు చూద్దాం..
1. లూసీఫీర్ రీమేక్: లూసీఫర్ రీమేక్ కోసం తమిళ దర్శకుడు మోహన్ రాజాతో తొలిసారి వర్క్ చేస్తున్నాడు. ఈయన తెలుగు వాడే కావడం విశేషం. ఈయన గతంలో అర్జున్, జగపతిబాబు, వేణులతో ‘హనుమాన్ జంక్షన్’ మూవీతోనే దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టడం విశేషం. ఒక రకంగా రచ్చ గెలిచి.. మళ్లీ ఇంట గెలవాలని చూస్తున్నారు.