Chiranjeevi: సమంతకు చిరంజీవి ఫోన్ కాల్.. అదే మ్యాటర్ డిస్కస్ చేశారా..?
Chiranjeevi: సమంతకు చిరంజీవి ఫోన్ కాల్.. అదే మ్యాటర్ డిస్కస్ చేశారా..?
Chiranjeevi Samantha: సమంత లేడీ ఓరియెంటెడ్ మూవీ యశోద విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మెగాస్టార్ ఆమెను ప్రత్యేకంగా పలకరించారని ఫిలిం నగర్ టాక్. సమంతతో ఫోన్ కాల్ మాట్లాడుతూ యశోద సినిమాలో అద్భుతంగా నటించావని అప్రిషియేట్ చేశారట చిరంజీవి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి మార్క్ కనిపిస్తోంది. ఇండస్ట్రీకి సంబంధించిన మంచి, చెడు చూసుకుంటూ అన్ని విషయాల్లో ముందుండి నడిపిస్తున్నారు మెగాస్టార్. తోటి నటీనటుల కష్టసుఖాలపై రియాక్ట్ అవుతూ వస్తున్న ఆయన తాజాగా సమంతకు ఫోన్ కాల్ చేశారని తెలుస్తోంది.
2/ 9
తాను మాయోటైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నానని సమంత ప్రకటించిన వెంటనే సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయిన చిరంజీవి.. ఇప్పుడు మరోసారి సమంతతో నేరుగా మాట్లాడారట. ఆమె నటించిన యశోద మూవీ రిలీజ్ తర్వాత చిరు కాల్ చేశారని సమాచారం.
3/ 9
సమంత లేడీ ఓరియెంటెడ్ మూవీ యశోద విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మెగాస్టార్ ఆమెను ప్రత్యేకంగా పలకరించారని ఫిలిం నగర్ టాక్. సమంతతో ఫోన్ కాల్ మాట్లాడుతూ యశోద సినిమాలో అద్భుతంగా నటించావని అప్రిషియేట్ చేశారట చిరంజీవి.
4/ 9
అలాగే సమంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారట చిరంజీవి. తన మాటలతో సమంతకు చిరంజీవి ధైర్యం చెప్పారని తెలుస్తోంది. చిరు ఫోన్ కాల్ రావడం పట్ల సమంత కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయిందట.
5/ 9
రీసెంట్ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తను క్లిష్ట పరిస్థితిలో ఉన్నా తప్ప చనిపోలేదని అనడం, తీవ్ర భావోద్వేగానికి లోనుకావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏదిఏమైనా పోరాడి మళ్లీ వస్తానని కూడా సమంత చెప్పడం ఆమె లోని ఆత్మవిశ్వాసాన్ని బయటపెట్టింది.
6/ 9
ఇటీవల కాలంలో వచ్చిన భారీ సినిమాలకు మించి తొలి రోజు యశోద వసూళ్లు రాబట్టడం సమంత అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. తాజా పరిస్థితుల నడుమ యశోద సినిమా సక్సెస్ టాక్ సమంతకు మంచి ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు.
7/ 9
సమంత, ఉన్ని కృష్ణన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన యశోద సినిమాకు హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహించారు. సరోగసీ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
8/ 9
శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుండటం సమంత అభిమానుల్లో జోష్ నింపింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
9/ 9
నాగ చైతన్యతో విడాకుల అనంతరం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టేసింది సమంత. వైవిధ్యభరితమైన కథలను ఓకే చేస్తూ ఫుల్ బిజీ అయింది. తెలుగుతో పాటు ఇతర బాషా చిత్రాల్లో కూడా నటిస్తూ పాన్ ఇండియా స్టార్ కావాలనే ప్రయత్నాలు చేస్తోంది.