Chiranjeevi - Chandrabose - Oscar: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. తాజాగా విశ్వయవనికపై ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు గాను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కలిసి చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. తాజాగా చంద్రబోస్.. ఆస్కార్ అవార్డుతో చిరంజీవిని భోళా శంకర్ సెట్లో కలిసారు. ఈ సందర్భంగా చిరు ఆస్కార్ అవార్డును పట్టుకొని సరదగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.
ఆస్కార్ అవార్డును నాటు నాటు పాటకు గాను కీరవాణితో కలిసి అందుకున్న గేయ రచయత చంద్రబోస్.. ఆమెరికా నుంచి రాగానే నేరుగా తనకు పాటల రచయతగా తొలిసారి అవకాశం ఇచ్చిన రామానాయుడు గారిని తలుచుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆయన తనయుడు సురేష్ బాబును కలసుకున్న సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు.ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో మన తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును తొలిసారి గెలుచుకుంది. ఒక భారతీయ సినిమా బెస్ట్ ఒరిజినల్ క్యాటగిరిలో అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. ఒక్క ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు.. 2023 ఆస్కార్‌లో పలువురు తొలిసారి ఈ అవార్డు అందుకోవడం విశేషం.ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని ‘నాటు నాటు' పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలందరు పండగ చేసుకున్నారు.
ఇక చిరంజీవి కూడా చంద్రబోస్ నుంచి ఆస్కార్ అవార్డును చేతుల్లోకి తీసుకొని మురిసిపోయారు. అంతేకాదు చంద్రబోస్ సత్కార కార్యక్రమంలో కూడా ఆస్కార్ అవార్డును విడిచిపెట్టలేదు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డును దగ్గర చూడటమే కాదు.. దాన్ని ముట్టుకునే సౌభాగ్యం తనకు కలిగించిన రాజమౌళితో పాటు టీమ్ మెంబర్స్‌కు మరోసారి కంగ్రాట్స్ తెలిపారు. (Twitter/Photo)