Chiranjeevi Old Titles : కార్తికేయ ‘రాజా విక్రమార్క’ సహా చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..

Chiranjeevi Old Titles- Kartikeya - Raja Vikramarka | గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా పాత సినిమా టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. తాజాగా కార్తికేయ చిరంజీవి నటించిన ఓల్డ్ టైటిల్ ‘రాజా విక్రమార్క’ టైటిల్‌తో బాక్సాఫీస్‌ను పలకరించారు. అంతేకాదు రీసెంట్‌గా సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా చిరంజీవి నటించిన పాత సినిమా టైటిల్. మొత్తంగా కార్తికేయ.. రాజా విక్రమార్క, అశోక్ గల్లా హీరో కాకుండా.. చిరంజీవి పాత టైటిల్స్‌తో తెరకెక్కిన చిత్రాలు ఏమేమి ఉన్నాయో మీరు ఓ లుక్కేండి..