ఈ చిత్రంలో చిరు అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నారని సమాచారం. విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతున్న ఈ సినిమిలో చిరు కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. ఇందులో మాస్ మహారాజ రవితేజ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్‌కు 154వ సినిమాగా తెరకెక్కుతుంది.
తాజాగా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ₹50 కోట్ల మొత్తాన్ని చెల్లించిందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు అని తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించబోతుందని లేటెస్ట్ టాక్. Chiranjeevi Photo : Twitter