మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్‌గా మొదటి చిత్రం చిరంజీవితోనే ప్రారంభమైంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వనీదత్ నిర్మాతగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రారంభమైంది. ఎందుకనో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కానీ ఆ తర్వాత ఈయన సురేష్ ప్రొడక్షన్స్ ‘సూపర్ హీరోస్’ సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రస్థానం మొదలు పెట్టారు. అక్క నుంచి సంగీత దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. (Twitter/Photo)
2. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘చూడాలని వుంది’. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా మ్యూజికల్‌గా సక్సెస్ సాధించింది. ఈ సినిమా ముందకు వరకు వేరే భాషకు చెందిన గాయకులు తెలుగులో అడపాదడపా పాడినా.. ఈ సినిమాలో వేరే భాష గాయకులు పాటడం అనే ట్రెండ్ ఎక్కువైంది. (Twitter/Photo)