Chiranjeevi Last Five Movie Collections : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత జోరు చూపిస్తున్నారు. రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150తో సూపర్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయారు. ఇక ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించారు. మొత్తంగా చిరు గత ఐదు సినిమాల టోటల్ కలెక్షన్స్ విషయానికొస్తే..
వాల్తేరు వీరయ్య | మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ హీరో, హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 137.85 కోట్ల షేర్ (రూ. 236.15 కో్ గ్రాస్) వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర రూ. 88 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఇక సినిమా మొత్తం లాభం రూ. 48.85 కోట్లు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
గాడ్ ఫాదర్ | చిరంజీవి హీరోగా సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 59.38కోట్లు షేర్ (108.70 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. మొత్తంగా రూ. 14.62 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది.
ఆచార్య | చిరంజీవి, రామ్ చరణ్ కథానాయకులుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆచార్య’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.36 కోట్ల షేర్ (రూ. 76 కోట్ల గ్రాస్) వసూళు చేసింది. ఓవరాల్‌గా రూ. 84.14 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (File/Photo)
సైరా నరసింహారెడ్డి | మెగాస్టార్ చిరంజీవి చారిత్రక యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు. నయనతార, తమన్నా హీరోయిన్స్‌గా నటించారు. తెలుగులో రూ. 143 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది మిగిలిన అన్ని భాషల్లో కలిపి రూ. 44.25కోట్లకు అమ్మారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 187.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 189 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 143.80 కోట్ల షేర్ (రూ. 240 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ. 43.45కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హిందీ,తమిళం, మలయాళంలో కనీసం ప్రభావం చూపించలేకపోయింది. (File/Photo)
ఖైదీ నంబర్ 150 | చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రపంచ వ్యాప్తంగా రూ. 87.87 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా టోటల్‌గా రూ. 104.6 కోట్ల షేర్ ( రూ. 180 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 17 కోట్ల వరకు బయ్యర్స్‌కు లాభాలను తీసుకొచ్చింది. (File/Photo)
ఓవరాల్‌గా చిరంజీవి ఐదు చిత్రాల్లో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత విడుదలైన సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీలు అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయాయి. ఓవరాల్‌గా చిరంజీవి ఐదు చిత్రాలు కలెక్షన్స్ కలిపితే రూ. 493 కోట్ల షేర్ (రూ. 1000 కోట్ల గ్రాస్) వరకు కలెక్షన్స్ రాబట్టాయి. ఏది ఏమైనా 60 యేళ్ల పై పడిన వయసులో చిరు ఈ రేంజ్ వసూళ్లు దక్కించుకోవడం మాములు విషయం కాదనే చెప్పాలి. (File/Photo)