ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్ తో రంగంలోకి దిగిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా తన మార్క్ చూపించారు. శృతి హాసన్ రోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా విజయం పట్ల చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.