Chiranjeevi | Chiranjeevi | చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్లు జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఆచార్య తర్వాత చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. దాంతో పాటు బాబీ, మెహర్ రమేష్ డైరెక్షన్లో నెక్ట్స్ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా చిరంజీవి మరో ఇద్దరు ముగ్డురు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తంగా మెగా స్టార్ ఎంత మంది దర్శకులకు కమిట్ మెంట్ ఇచ్చాడనే దానిపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. (Twitter/Photo)
ముందుగా కొరటాల శివ దర్శకత్వంలతో చేస్తోన్న ‘ఆచార్య’ సినిమాను మే 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేసారు. ఆగష్టు లో చిరు పుట్టినరోజున కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ నెలాఖారు వరకు ఆచార్య కు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. (Twitter/Photo)
లూసీఫర్ రీమేక్ మూవీని మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకు మెగాస్టార్ కొబ్బరికాయ కొట్టేసాడు. ఆచార్య తర్వాత ముందుగా ‘లూసీఫర్’ రీమేక్‌ను స్టార్ట్ చేద్దామనుకునుకుంటే.. కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశం వుంది. వీలైతే జూలైలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు. మధ్యలో మోహన్ రాజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవేమి నిజం కావని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. (Twitter/Photo)
వంశీ పైడిపల్లి 2019 యేడాది గాను మహర్షి సినిమాకు నేపనల్ అవార్డును అందుకున్నారు. ఇక చిరుతో చేయబోయే సినిమా కూడా మంచి సామాజిక సందేశం ఉన్న కథతోనే తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. త్వరలో వీళ్లిద్దరి కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి.. విజయ్‌తో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తర్వాత చిరు ప్రాజెక్ట్ టేకప్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
త్రివిక్రమ్: చాలా రోజుల కిందే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయింది. ‘వినయ విధేయ రామ’ ఆడియో వేడుకలోనే త్రివిక్రమ్ సినిమా ప్రకటించాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబు, వెంకటేష్,ఎన్టీఆర్ సినిమాల తర్వాత చిరంజీవి, త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అప్పట్లో ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి.. చిరు, పవన్‌లతో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. (Twitter/Photo)
బోయపాటి శ్రీను: మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి కూడా చిరంజీవికి కథ చెప్పారు. అయితే అనుకోని కారణాలతో సినిమా ఆగిపోయింది. బోయపాటి శ్రీను ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య, కళ్యాణ్ రామ్, రవితేజలతో వరుస ప్రాజెక్ట్స్ చేయడానికి కమిటయ్యారు. ఇవి కంప్లీట్ కావాలంటే మరో మూడేళ్లు పట్టేలా ఉంది. (Twitter/Photo)
ప్రశాంత్ వర్మ: అ.. సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుని ఆ తర్వాత కల్కితో పర్లేదు అనిపించుకున్న కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నాడు. మెగాస్టార్‌కు కథ చెప్పాలని ట్రై చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే ఓ చిరుకు ఓ కథను వినిపించాడట. చిరు మాత్రం ఈ స్టోరీ లైన్‌ను డెవలప్ చేయమని చెప్పినట్టు సమాచారం. ఇక ప్రశాంత్ వర్మ.. రీసెంట్గా దర్శకత్వంలో ‘జాంబి రెడ్డి’ సినిమా విడుదలై హిట్ అందుకుంది.