Chiranjeevi: ఆస్కార్ విజేతలకు చిరంజీవి సత్కారం.. నాగార్జున, వెంకటేష్ సమక్షంలో వేడుకగా..!
Chiranjeevi: ఆస్కార్ విజేతలకు చిరంజీవి సత్కారం.. నాగార్జున, వెంకటేష్ సమక్షంలో వేడుకగా..!
Naatu Naatu Oscar Winning Team: తాజాగా RRR బృందాన్ని, నాటు నాటు పాట కోసం కృషి చేసి ఆస్కార్ తీసుకురావడంలో భాగమైన ప్రతి ఒక్కరినీ మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ లోకంతో పాటు యావత్ భారత దేశం ఎదురు చూసిన అపూర్వ ఘటాన్ని రీసెంట్ గానే మనమంతా చూశాం. అందరూ ఊహించినట్లుగానే RRR మూవీ లోని నాటు నాటు సాంగ్ ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడంతో దేశమంతా సంబరాలు చేసుకుంది.
2/ 8
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై రైటర్ చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఇండియన్ ఆడియన్స్ పులకరించిపోయారు.
3/ 8
జక్కన్న చెక్కిన RRR మూవీలోని నాటు పాటకు ఆస్కార్ దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. దేశ సినీ చరిత్రలో ఇదో అద్భుతం అంటూ నాటు నాటు పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.
4/ 8
ఈ నేపథ్యంలోనే తాజాగా RRR బృందాన్ని, నాటు నాటు పాట కోసం కృషి చేసి ఆస్కార్ తీసుకురావడంలో భాగమైన ప్రతి ఒక్కరినీ మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి- సురేఖ దంపతులు పాల్గొని ఆస్కార్ విజేతలకు శాలువా కప్పి సత్కరించారు.
5/ 8
ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన చిరంజీవి.. ''ఆస్కార్ విజేతలని మిత్రుల సమక్షంలో సత్కరించుకోవటం నిజమైన వేడుక అనిపించింది. తెలుగు వారు భారతీయ సినిమా కి సాధించిన ఈ పురస్కారం చరిత్ర గా నిలిచిపోతుంది'' అని పేర్కొన్నారు. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి.
6/ 8
ఈ అపూర్వ కార్యక్రమంలో చిరంజీవి దంపతులతో పాటు నాగార్జున- అమల దంపతులు, రాజమౌళి- రమా దంపతులు, విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, అక్కినేని నాగ చైతన్య, అఖిల్, RRR నిర్మాత దానయ్య తదితరులు పాల్గొన్నారు.
7/ 8
లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో నాటు నాటు సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. నాలుగు ఇతర సినిమాల పాటలతో పోటీ పడి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ గెలుచుకుంది. దీంతో యావత్ భారతదేశం గర్విస్తోంది.
8/ 8
పాన్ ఇండియా మూవీగా వచ్చిన RRR సినిమాలోని ఈ నాటు నాటు పాటకు కీరవాణి సంగీతం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల బైరవ పాడారు. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ఈ సాంగ్ విడుదలైనప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. ఇప్పుడు ఆస్కార్ గెలుచుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.