ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్‌కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ తో పాటుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్సకి కావాల్సినంత మొత్తం లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి సైతం 3 లక్షల రూపాయలను ఇచ్చారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి సాయంగా సోనూసూద్, ధనుష్ కూడా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. Photo : Twitter
Siva Sankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివశంకర్ మాస్టర్ ఇటీవల కరోనా బారిన పడడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. శివశంకర్ మాస్టర్ ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఈరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని అంటున్నారు. ఇక మరోవైపు శివశంకర్ మాస్టర్ పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో ఆయనకు కూడా కొంత సీరియస్‌గా ఉందని.. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. Photo : Twitter
ఇక శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. కుటుంబం మొత్తం కరోనా బారిన పడడంతో రోజూవారి ఖర్చులకు అధిక మొత్తంలో అవుతుండటంతో.. అంత మొత్తం భరించే శక్తి తమ వద్ద లేదని అంటున్నారు శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు. Photo : Twitter
దీంతో ఇండస్ట్రీ వర్గాల నుండి ఏదైనా కొంత సాయం కావాలని శివశంకర్ మాస్టర్ తనయుడు అజయ్ కృష్ణ కోరుతున్నారని తెలుస్తోంది. శివశంకర్ మాస్టర్ డాన్స్ మాస్టర్‌గా పరిచయం అక్కరలేని పేరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్నారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్‌కు ఆయనకు జాతీయ అవార్డ్ వరించింది. Photo : Twitter