తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బాక్సాఫస్ దగ్గర ఇప్పటి వరకు రూ. 126.31 కోట్ల షేర్ (రూ. 216) కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొత్తంగా యేడాది వ్యవదిలో ఈయన నటించిన ‘ఆచార్య, గాడ్ ఫాదర్’, తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాల గ్రాస్ కలిపితే రూ. 400 కోట్లు గ్రాస్ వసూళ్లను దాటాయి. సీనియర్ హీరోల్లో ఒక యేడాది వ్యవధిలో ఓ హీరో నటించిన సినిమాలకు రూ. 400 కోట్లు కొల్లగొట్టడం అనేది చాలా రేర్ అనే చెప్పాలి. ఓ రకంగా RRR మినహా మిగతా యంగ్ హీరోలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. TwitterWaltair Veerayya collections
ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల్లో తన ఏజ్‌కు తగ్గ పాత్రలను చేసిన చిరంజీవి.. ‘వాల్తేరు వీరయ్య’లో ఔట్ అండ్ ఔట్ ఊర మాస్ వీరయ్యగా ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నారు. తన నుంచి ప్రేక్షకులు ఏది ఆశిస్తున్నారో అవన్ని ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. దీంతో సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలదొక్కుకుంది. ఈ సినిమా 16రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
16 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో .. రూ. 34.20కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో.. రూ. 17.27 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 18.49 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 10.64 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 5.89 కోట్లు.. గుంటూరు.. రూ. 7.54 కోట్లు.. కృష్ణ.. రూ. 7.34 కోట్లు.. నెల్లూరు..రూ. 4.33 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 105.70 కోట్లు షేర్ / రూ. 170.90 కోట్ల గ్రాస్) కర్ణాటక + రెస్టాఫ్ భారత్.. రూ. 7.81 కోట్లు.. ఓవర్సీస్లో రూ. 12.80కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 126.31కోట్లు..(రూ. 216 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 89 కోట్లు రాబట్టాలి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 37.31 కోట్ల లాభాల్లోకి వచ్చి సూపర్ హిట్ స్టేటస్ దాటి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు.. రూ. 29.30 కోట్లు షేర్.. (రూ. 49.10 కోట్లు), రెండో రోజు.. రూ. 14.60 కోట్లు షేర్ (రూ. 26.40 కోట్ల గ్రాస్).. మూడో రోజు.. రూ. 15.01 కోట్లు షేర్ ... (26.45 కోట్ల గ్రాస్).. నాల్గో రోజు ఈ సినిమా రూ. 14.77 కోట్ల షేర్ (రూ. 25.80 కోట్ల గ్రాస్), ఐదో రోజు.. రూ. 9.85 కోట్లు షేర్ (రూ. 16.40 కోట్ల గ్రాస్), ఆరో రోజు రూ. 7.88 కోట్ల షేర్ (రూ. 13 కోట్ల గ్రాస్), ఏడో రోజు రూ. 5.05 కోట్లు.. (రూ. 8.30 కోట్ల గ్రాస్), 8వ రోజు .. 4.70 కోట్లు (రూ. 7.90 కోట్ల గ్రాస్), 9వ రోజు రూ. 5.56 కోట్లు (రూ. 9.40 కోట్ల గ్రాస్), 10 రోజు రూ. 7.41 కోట్ల షేర్ (12.70 కోట్ల గ్రాస్), 11వ రోజు రూ. 2.80కోట్లు (రూ. 5.25 కోట్ల గ్రాస్), 12వ రోజు రూ. 1.32కోట్ల షేర్ (రూ. 2.20 కోట్ల గ్రాస్), 13వ రోజు రూ. 0.77 కోట్ల షేర్ (1.21 కోట్ల గ్రాస్,),14వ రోజు రూ. 2.19 కోట్ల షేర్ (రూ. 3.55 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. అన్ని ఏరియాల్లో 100 శాతం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాలు వరదల్లా వచ్చి పడుతోంది. (Twitter/Photo)
మొత్తంగా చూసుకుంటే.. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150 మూవీ.. రూ. 100 కోట్ల గ్రాస్‌తో పాటు షేర్ అందుకుంది. ఆ తర్వాతా సైరా .. నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ మూవీలు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచినా.. రూ. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇక చిరంజీవి కెరీర్లో నాల్గో 100 కోట్ల గ్రాస్ చిత్రంగా ‘వాల్తేరు వీరయ్య’ రికార్డులకు ఎక్కింది. అంతేకాదు మూడో రూ. 150 కోట్ల చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ఈ సినిమా ప్రవేశించింది. సైరా తర్వాత చిరు హీరోగా నటించిన రెండో సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. (Twitter/Photo)
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..తెలంగాణ (నైజాం)లో .. రూ. 18 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో.. రూ. 15 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 10.2 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 6.50 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 6.50 కోట్లు.. గుంటూరు.. రూ. 7.50 కోట్లు.. కృష్ణ.. రూ. 5.6 కోట్లు.. నెల్లూరు..రూ. 3.2 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 72 కోట్లు.. కర్ణాటక .. రూ. 5 కోట్లు.. రెస్టాఫ్ భారత్.. రూ. 2 కోట్లు.. ఓవర్సీస్లో రూ. 9 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు.. ఈ సినిమా రూ. 89 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. (Twitter/Photo)
మొత్తంగా ఖైదీ నంబర్ 150 తర్వాత సంక్రాంతి బరిలో అదే తరహాలో మాస్ ఓరియంటెడ్ మూవీతో చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. ఓవరాల్‌గా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా ఈ యేడాది మన తెలుగులోనే కాదు.. దేశంలోనే తొలి హిట్ నమోదు చేసిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. (Twitter/Photo)