[caption id="attachment_1348060" align="alignnone" width="1600"] మరోవైపు గోపీచంద్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. హీరోగా గోపీచంద్ నటించిన ‘సాహసం’, ఒక్కడున్నాడు’ సినిమాలంటే తనకెంతో ఇష్టమన్నారు. ఒక నార్త్‌లో గోపీచంద్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక చాణక్య సినిమా కూడా బాగుంటుందని కితాబుచ్చాడు. ఇక గోపీచంద్ నటించిన ‘చాణక్య’ సినిమా అప్పట్లో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’కి పోటీగా విడుదలై కమర్షియల్‌గా ఫెయిల్ అయింది. (Twitter/Photo)
ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి (Maruthi) చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ (Pakka Commercial) సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారట. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. మరి టైటిల్‌కు తగ్గట్టు పక్కా కమర్షియల్ .. విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)