మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నేటితో షూటింగ్ పూర్తి చేసుకుందని.. కేవలం రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. అందులో ఒకటి చిరంజీవి, సల్మాన్ ఖాన్లు కలిసి చిందేసే ఒక లవ్లీ సాంగ్ కాగా.. మరోకటి స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈ సినిమా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ లూసిఫర్‌కి అఫీషియల్ తెలుగు రీమేక్‌గా వస్తోంది. మంచి కథతో రానుండడంతో ఈ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలున్నాయి. నయనతార కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Photo : Twitter
ఇక ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా దసరాకు విడుదలకానుందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి హిందీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. Photo : Twitter
గాడ్ ఫాదర్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిరు లుక్ బావుందని నెటిజన్లు చెబుతున్నారు. వయసు పెరుగుతున్న చిరంజీవి ఎనర్జటిక్‌గా కనిపిస్తున్నారంటున్నారు.
ఇక అది అలా ఉంటే చిరంజీవి మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి తాజాగా పక్కా కమర్షియల్ ప్రిరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యూవీ విక్కీ నాతో సినిమా చేయాలన్నారు. నేను వెంటనే ఓకే అన్నాను, మారుతి ఇక ఆ సినిమా మీద దృష్టి పెట్టు అన్నారు. అయితే మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏ జోనర్లో ఉండనుంది. ఎలాంటి కథతో వస్తున్నారు అనే విషయంలో క్లారిటీ రానుంది. మారుతి పక్కా కమర్షియల్ సినిమా తర్వాత ప్రభాస్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా తర్వాత ఇది ఉండోచ్చని అంటున్నారు. Photo : Twitter
మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.Photo : Twitter