గాడ్ ఫాదర్ సినిమాతో మరింత పాపులర్ అయ్యారు నటి దివి. ఆమె ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ విషయంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన దివి.. ఆ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో వుండే కమిట్మెంట్ గురించి తన అభిప్రాయాలను తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కమిట్మెంట్ అనేది అందరికి తెలిసిన విషయమే.. మమ్ముల్ని అడగలేదని ఎవరైనా అంటే అది పెద్ద నిజం కాదు అని తెలిపారు. Photo : Instagram
అయితే ఈ కాస్టింగ్ కౌచ్ విషయం ఒక్కోక్కు ఒక్కో విధంగా వుంటారని, కొందరికి కెరియర్లో ఎదగాలి అని వుంటుంది.. వారు ఈ ఇలాంటి విషయాలను పట్టించుకోరు.. అడగ్గానే లోంగిపోతారు. మరి కొందరు ఆ పని చేయటానికి మనసొప్పక సున్నితంగా తిరస్కరిస్తారని.. అయితే ఎవరైనా ఇష్టం ఉండి కమిట్ అయితే అది తన దృష్టిలో అది పెద్ద తప్పు కాదని.. ఇష్టం లేకపోయినా బలవంతం పెట్టడం మాత్రం పెద్ద తప్పు అంటూ మాట్లాడారు.. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram
దివి వద్త్యా బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యిన హైదరాబాదీ అందం. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించిన దివి.. ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న `భోళాశంకర్` సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకుడు. బోళాశంకర్ తమిళ హిట్ సినిమా వేదాళంకు రీమేక్’గా వస్తోంది. కీర్తి సురేష్, తమన్నా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. Photo : Instagram
దివి వద్త్యా బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యిన హైదరాబాదీ అందం. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించిన దివి.. ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న `భోళాశంకర్` సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకుడు. బోళాశంకర్ తమిళ హిట్ సినిమా వేదాళంకు రీమేక్’గా వస్తోంది. కీర్తి సురేష్, తమన్నా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. Photo : Instagram
కొంత మంది ముద్దుగుమ్మలకు అందం ఉంటుంది కానీ అదృష్టం ఉండదు. దివి కూడా ఈ కోవలోకే వస్తుంది. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాని అందం ఈమె సొంతం. అయినా కూడా అమ్మడికి లక్కు లేక ఇక్కడే ఆగిపోయింది. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా కూడా ఈమెకు గుర్తింపు వచ్చింది మాత్రం బిగ్ బాస్‌తోనే. సీజన్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ముక్కుసూటిగా ఉంటూ.. ఉన్నదున్నట్లు చెప్తూ బిగ్ బాస్ హౌజ్‌లో 50 రోజులుంది. Photo : Instagram
బిగ్ బాస్ 4 తెలుగులో మిగిలిన అమ్మాయిలున్నా కూడా దివి మాత్రం అందరి కంటే ఎక్కువగానే ఆకట్టుకుంది. అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌజ్‌లో కూర్చోబెట్టారు. మొదట్లో చాలా కామ్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయింది. మెల్లగా తనలోని మరో మనిషిని బయటికి తీసుకొచ్చింది. ప్రస్తుతం దివి ప్రేమకథ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలే వినిపిస్తున్నాయి. Photo : Instagram
ఈమె అందాల వలకు కుర్రళ్ల మతులు చెడిపోతున్నాయి. గతంలోనే ఈమె మహేష్ బాబు 'మహర్షి' చిత్రంలో నటించింది. ఆ విషయం తెలియగానే అంతా ఆమె కోసం చూసారు. అయితే ఇంత సైలెంట్‌గా కనిపించే ఈమె జీవితంలో ఓ బ్రేకప్ స్టోరీ కూడా ఉంది. గతంలో ఈమె ఒక అబ్బాయిని ప్రేమించింది.. కొన్నాళ్ల పాటు అతడితో రిలేషన్ షిప్లో కూడా ఉంది. Photo : Instagram
ఈ విషయం తనే స్వయంగా చెప్పింది. అయితే కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ అయిపోయింది. దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చింది దివి. బ్రేకప్ తర్వాత తన లైఫ్‌లో ఎవరు లేరని.. సింగిల్‌గా ఉండటమే బాగుందని చెప్పింది. నిజానికి ఇలా ఉంటేనే మనకు నచ్చినట్లు ఉంటామని.. ఎలా కావాలంటే అలా బతుకుతామని చెప్తుంది దివి. Photo : Instagram
అందుకే ఇలా ఉండటమే మంచిదని ఫిక్సైపోయినట్లు చెప్పింది దివి. తాను రిలేషన్ షిప్లో ఉన్నప్పుడు కూడా కరెక్ట్‌గానే ఉన్నానని తెలిపింది ఈమె. దివి ప్రేమకథ గురించి వాళ్ల పేరెంట్స్ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శశికాంత్, దేవిక వైద్య వాళ్ల కొడుకునే దివి ప్రేమించిందని.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు దివి తల్లిదండ్రులు. కానీ ఇద్దరి మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారని.. తమ కూతురు జీవితంలోని ప్రేమకథ గురించి చెప్పుకొచ్చారు వాళ్లు. Photo : Instagram
అలాగని అతడు చెడ్డవాడు కాదని.. చాలా మంచి వ్యక్తి అంటుంది దివి. కాకపోతే అతని కుటుంబంలో చిన్న సమస్య రావడంతో బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందంటుంది దివి కూడా. ఇప్పటికీ అతనిపై తనకు మంచి అభిప్రాయమే ఉందని.. అతడు చాలా మంచి అబ్బాయి అంటుంది. కాకపోతే అతడి తమ్ముడు చనిపోవడంతో ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. అప్పుడు తనను పెళ్లి చేసుకుని పళ్లెటూరుకు వచ్చేయాలంటూ కోరాడని చెప్పింది. కానీ చిన్నప్పటి నుంచీ హైదరాబాద్‌లోనే పెరగడం వల్ల పల్లెటూరు తనకు అలవాటు లేదని చెప్పింది. Photo : Instagram