తాాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాత అధికారికంగా ప్రకటిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నిర్మాత ఎన్వీ రమణ.. పోస్టు చేస్తూ.. ఇక ఎలాంటి రూమర్స్‌ను నమ్మొద్దు. మెగాస్టార్ చిరు నటించిన గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. త్వరలోనే ప్రమోషన్లను కూడా మేం మొదలు పెడుతాం అని పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో ఎందరో ప్రముఖ తారలు కూడా నటిస్తున్నారు. సత్యదేవ్ నెగటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర పోషించగా నయనతార అతని భార్యగా నటించడం విశేషం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న గాడ్ ఫాదర్ లో ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే కొన్ని కీలక మార్పులు చేశారు. తమన్ అందించిన సంగీతం కూడా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర’లో నటిస్తున్న విషయం తెలిసిందే, రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం చిరు కోసం ఆయన ఈ సినిమాలో నటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ల మధ్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని చెబుతున్నారు. ఆ సన్నివేశాలు ఈ సినిమాలో కీలకం కానున్నాయి.
గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి తనకు అచ్చొన్చిన ఖైదీ పాత్రలో కనిపంచబోతున్నారు. గతంలో వచ్చిన ‘ఖైదీ, ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 సినిమాలు సక్సెస్ అయ్యాయి. అదే కోవలో ఖైదీ గెటప్‌లో చిరంజీవి కనిపించనున్న ఈ సినిమా సెంటిమెంట్ ప్రకారం బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని అభిమానులు అపుడే లెక్కలు వేసుకుంటున్నారు.
. పూర్తిగా సీరియర్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను చిరు ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మోహన్ రాజా. ఇందులో ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరుతో సల్మాన్ ఖాన్ స్టెప్పులు ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉంటుందని చెబుతున్నారు. Chiranjeevi Godfather hindi rights Photo : Twitter
మలయాళ ఒరిజినల్ ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఆ చిత్రంలో కీ రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తొలిసారి దక్షణాదిలో నటిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారు. ఆ చనువుతో ఇపుడు చిరు మూవీతో డైరెక్ట్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.