ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐదు రోజుల్లో కలిపి 63 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డే వైజ్ గాడ్ ఫాదర్ వసూళ్లు చూస్తే.. Day 1: 12.97Cr Day 2: 7.73Cr Day 3: 5.41Cr Day 4: 5.62Cr Day 5: 5.23Cr Day 6: 1.51Cr మొత్తంగా 38.47 నెట్ (63.50CR గ్రాస్) వసూళ్లు నమోదయ్యాయి.
ఇక ఏరియావారిగా చూస్తే.. ఇప్పటివరకు నైజాం 11.37Cr, సీడెడ్ 8.71Cr, ఉత్తరాంధ్ర 5.16Cr, ఈస్ట్ గోదావరి 3.35Cr, వెస్ట్ గోదావరి 1.98Cr, గుంటూరు 3.66Cr, కృష్ణా 2.40Cr, నెల్లూరు 1.84Cr, అదేవిధంగా కర్ణాటక 4.40Cr, హిందీ+ROI 4.60Cr ఓవర్సిస్ 4.40Cr వచ్చాయి. మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా 51.77CR నెట్ (93.95CR గ్రాస్) వసూలైంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్ లాంటి భారీ తారాగణం భాగమయ్యారు. విడుదలకు ముందు వదిలిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు ఈ గాడ్ ఫాదర్.