God Father 14 Days World Wide Box Office Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా‘గాడ్ ఫాదర్’. దసరా కానుకగా విడుదలైన ’గాడ్ ఫాదర్’ నిన్నటితో 2 వారాలు (14 రోజులు ) పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రాబట్టాలి.. చిరంజీవి ముందున్న టార్గెట్ విషయానికొస్తే..
విజయ దశమి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఆశించిన రేంజ్లో వసూళ్లను రాబట్టలేకపోయింది. మొదటి రోజు ఓ మోస్తరు వసూళ్లను సాధించిన ఈ సినిమా.. విడుదలైన 8వ రోజుల తర్వాత ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.అంతేకాదు ఈ సినిమాను థియేట్రికల్ బిజినెస్‌ను రూ. 18 కోట్లకు పైగా తగ్గించారు. (Twitter/Photo)
’గాడ్ ఫాదర్’ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అనుకున్నంత రేంజ్లో రాబట్టలేకపోయింది. అంతకు ముందు చిరు సినిమాలతో పోలిస్తే అత్యంత తక్కువ వసూళ్లను సాధించింది. ‘గాడ్ ఫాదర్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన అందుకు తగ్గట్టు వసూళ్లను సాధించ లేకపోయింది. నైజాం, రెస్టాఫ్ భారత్‌లో ఈ సినిమాను అమ్మిన నిర్మాతలు, ఆంధ్ర, సీడెడ్‌లో ఓన్‌గా అడ్వాన్స్ పద్దతిలో రిలీజ్ చేసినట్టు చెప్పారు. దీంతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా తగ్గించారు. ఓ విధంగా ఈ మూవీని హిట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ తగ్గించినట్టు అందరు చెప్పుకుంటున్నారు. (Twitter/Photo)
చిరంజీవి ’గాడ్ ఫాదర్’ మూవీని ఆల్రెడీ తెలుగులో డబ్బైన మోహన్‌లాల్ ’లూసీఫర్’ సినిమాను చూసి ఉండటంతో ఈ సినిమాను థియేటర్స్‌లో చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదని ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను చూస్తే తెలుస్తోంది.ఇక 14వ రోజు ఏపీ తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 33 లక్షలు షేర్.. (రూ. 60 లక్షలు గ్రాస్) వసూళ్లను రాబట్టింది. (Twitter/Photo)
ఏరియా వైజ్ 14వ రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 12.21 కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 9.48కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 5.85 కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 3.82 కోట్లు.. వెస్ట్ గోదావరి - రూ. 2.41 కోట్లు గుంటూరు - రూ. 4.01 కోట్లు కృష్ణా - రూ. 2.84 కోట్లు.. నెల్లూరు రూ. 2.10కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి 14 రోజులు కలిపి రూ. 42.42కోట్లు షేర్ (రూ. 70.25 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. (Twitter/Photo)
కర్ణాటక - రూ. 4.70కోట్ల షేర్, హిందీ + రెస్టాఫ్ భారత్ రూ. 5.10కోట్లు.., ఓవర్సీస్ రూ. 5.14 కోట్లు, టోటల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 57.66కోట్లు (104.70 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. మొత్తంగా చిరంజీవి గత చిత్రాలు.. ఆచార్య, సైరాలతో పోలిస్తే సెకండ్ ఇన్నింగ్‌లో చిరు సినిమాకు వచ్చిన అతి తక్కువ ఓపెనింగ్స్ దీనికే వచ్చాయి. (Twitter/Photo) (Chiranjeevi Twitter)
చిరంజీవి రేంజ్‌కు తక్కువ వసూళ్లు వచ్చాయనే వారికి ఒక విషయం చెప్పాలి. చిరుతో సమకాలికులైన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో .. బాలయ్య ఒక్కడే బాక్సాఫీస్ దగ్గర నిలకడగా రాణిస్తున్నారు. వెంకటేష్.. తోటి హీరోలు ఎవరైనా ఉంటేనే ఈయన సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. నాగార్జున పరిస్థితి మరి దారుణం. ఈయన గత సోలో చిత్రాలు.. ‘ది ఘోస్ట్’, ‘వైల్డ్ డాగ్’ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు.
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీతో మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని రూ. 18 కోట్లు తగ్గించి రూ. 73 కోట్లకు థియేట్రికల్ బిజినెస్‌ను సెట్ చేశారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 74 కోట్లు రాబట్టాలి. ఈ చిత్రం ఇంకా రూ. 16.34 కోట్లు రాబడితే క్లీన్ హిట్‌గా నిలుస్తోంది. ఇపుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడం అంత తేలిక వ్యవహారం కాదనే చెబుతున్నారు ట్రేడ్ పండితులు. మొత్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్‌గా నిలినిచింది. ఈ శుక్రవారం మరో నాలుగు కొత్త చిత్రాలు రానున్నాయి. ఒక రకంగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు క్లోజ్ అయినట్టే చెప్పాలి. (Twitter/Photo)
ఏరియా వైజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 22 కోట్లు షేర్ నుంచి రూ. 17.50 కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 13.50.కోట్లు షేర్ నుంచి రూ. 11.50 కోట్లు , ఆంధ్ర ప్రదేశ్ రూ. 35 కోట్లు నుంచి రూ. 25 కోట్లు... ఏపీ+ తెలంగాణ రూ. 54 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ రూ. 6.50 కోట్లు.. నుంచి రూ. 5.50 కోట్లు, ఓవర్సీస్ రూ. రూ. 7.5 కోట్లు.. టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 91 కోట్లు నుంచి రూ. 73 కోట్లుకు తగ్గించారు. (Twitter/Photo)
గాడ్ ఫాదర్ మూవీ తక్కువ ఓపెనింగ్స్ కారణాలు ఇవే అంటూ చెబుతున్నారు. ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ మూవీ పై పడిందనే చెప్పాలి. దాంతో పాటు లూసీఫర్ రీమేక్ కూడా ఓ కారణం అని చెప్పాలి. ఆల్రెడీ ఈ సినిమాను ఓటీటీ వేదికగా తెలుగు వెర్షన్‌ను చూసేసారు. ఆ ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ సినిమా వసూళ్లపై చూపెట్టింది. (Twitter/Photo)
పైగా ఆచార్య సినిమాను సోలోగా ఎక్కువగా థియేటర్స్‌లో విడుదల చేశారు. కానీ గాడ్ ఫాదర్ మూవీని తక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేయడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. మరోవైపు ఆచార్య సినిమాను మొదటి రోజు మల్లీప్లెక్స్‌లో రూ. 350కు అమ్మితే.. గాడ్ ఫాదర్ మూవీని రూ. 250కు అమ్మడం కూడా వసూళ్లపై ప్రభావం చూపిందనే చెప్పాలి. మొత్తంగా ఆచార్య ఎఫెక్ట్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ పై పడిందని ఒప్పుకోవాలి. ఇక ఇప్పటి యూత్ ఒకప్పటిలా చిరంజీవి చూడటానికి అంతగా ఇష్టపడటం లేదా అనే కారణాలు కూడా వెంటాడుతున్నాయి. (Twitter/Photo)
పైగా సీరియస్‌గా సాగే కథనం కూడా హీరోయిన్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. చిరు సినిమా అంటే ఫైట్స్‌తో పాటు డాన్సులు ఆశిస్తారు. అవేమి లేకపోవడం కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ పై పడ్డాయనే చెప్పాలి. ఇక కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు గాడ్ ఫాదర్ మూవీ వసూళ్లపై గట్టి దెబ్బే పడిందనే చెప్పాలి. మొత్తంగా మెగాస్టార్ రేంజ్‌కు ఈ స్థాయి వసూళ్లు అనేవి ఆయన అభిమానులకు కూడా షాక్‌కు గురి చేస్తున్నాయి. ఓ రకంగా చూస్తే.. గాడ్ ఫాదర్‌కు వచ్చిన వసూళ్లు తక్కువేం కాదు. ఏమైనా చిరు.. తన సినిమాల థియేట్రికల్ బిజినెస్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని గాడ్ ఫాదర్ రిజల్ట్ చెబుతోంది. (Twitter/Photo)