విడుదలకు ముందు నెలకొన్న బజ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కలిపి 73 కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో 17.50 కోట్లు, సీడెడ్లో 11.50 కోట్లు, ఆంధ్రాలో 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 54 కోట్ల బిజినెస్ చేయగా.. కర్నాకటలో 6 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో మరో 5.50 కోట్లు, ఓవర్సీస్లో 7.50 కోట్లతో కలిపి మొత్తం 73 కోట్ల బిజినెస్ చేసింది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్ లాంటి భారీ తారాగణం భాగమయ్యారు. విడుదలకు ముందు వదిలిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. అంచనాలకు తగ్గట్టుగా మొదట రాణించిన గాడ్ ఫాదర్.. క్రమంగా డీలా పడ్డాడు.