నిన్నటితో (శనివారం) గాడ్ ఫాదర్ సినిమా 11 రోజుల రన్ పూర్తి చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ 11 రోజుల్లో కలిపి 68 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డే వైజ్ గాడ్ ఫాదర్ వసూళ్లు చూస్తే.. Day 1: 12.97Cr Day 2: 7.73Cr Day 3: 5.41Cr Day 4: 5.62Cr Day 5: 5.23Cr Day 6: 1.51Cr Day 7: 83L Day 8: 62L Day 9: 47L Day 10: 41L Day 11: 56L
ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ గాడ్ ఫాదర్.. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగారు. ఇప్పటివరకు ఈ గాడ్ ఫాదర్ సినిమా టోటల్గా దాదాపు 56 కోట్ల వసూళ్లను రాబట్టింది. సో.. 36 కోట్ల మేర వసూళ్లు వస్తేనే లాభాల బాటలోకి వెళ్ళినట్లవుతుంది. సో.. చూస్తుంటే బ్రేక్ ఈవెన్ క్రాస్ కావాలంటే ఈ మూవీ కలెక్షన్స్ జోరు ఖచ్చితంగా పెరగాలనేది మాత్రం స్పష్టమవుతోంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్ లాంటి భారీ తారాగణం భాగమయ్యారు. విడుదలకు ముందు వదిలిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. అంచనాలకు తగ్గట్టుగా మొదట రాణించిన గాడ్ ఫాదర్ క్రమంగా వెనక్కి తగ్గుతున్నాడు.