దసరా పండగ తర్వాతి రోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైద్రాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది సినీ, రాజకీయ, పండితులు హాజరయ్యారు. ఈ వేడుకలో మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావుతో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
17 సంవత్సరాలుగా ప్రతి ఏడాది దత్తాత్రయ కుటుంబం ఈ వేడుకను చేస్తూ వస్తోంది. ఈ ఏడాది ఈ బృహత్తర కార్యక్రమానికి చిరంజీవి హాజరు కావడంతో అక్కడున్న వారంతా మెగా ఫ్రేమ్ కోసం ఎగబడ్డారు. చిరు రాగానే ఫోటోల మీద ఫోటోలు దిగారు. అలయ్ బలయ్ అంటే ఆత్మీయ ఆలింగనమే అర్ధము కూడా ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ రాకతో అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
చిరంజీవి గారూ దయచేసి ఆ ఫొటోస్ దిగడం ఆపేసి వెంటనే ఇక్కడికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.. అప్పుడే నేను మాట్లాడటం మొదలుపెడతాను అని అన్నారు గరికపాటి. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టైయింది. దీంతో మెగాభిమానులు గరికపాటిని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు.
గత కొన్ని రోజులుగా తనుక గరికపాటి గారికి జరుగుతున్న ఈ వివాదంపై చిరంజీవి గురువారం జరిగిన ప్రెస్మీట్లో స్పందించారు. మహా సహస్రవధాని గరికపాటి గారు పెద్దాయన. గొప్ప వ్యక్తి. ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇకపై ఈ వివాదానికి స్వస్తి పలకలన్నారు. ఈ సందర్భంగా తాను చేయబోతున్న సినిమాల గురించి చర్చించారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా చిరంజీవి ‘ఆచార్య’ ఫ్లాప్‌పై స్పందించారు. మా సినిమాలు ఆడకపోవడం అనే దానికి మేమే పూర్తి బాధ్యత వహిస్తామన్నారు. అందుకే ఈ సినిమా కోసం మేము తీసుకున్న రెమ్యునరేషన్లో 80 శాతం తిరిగి ఇచ్చేశామన్నారు. మరోవైపు చరణ్.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ కంటే ’గాడ్ ఫాదర్’ సక్సెస్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. (Twitter/Photo)
అలాగే 2008లో తాను స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ గురించి ప్రస్తావించారు. రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల తనకు మేలే జరిగిందన్నారు. ఒకవేళ పార్టీ ఉండి ఉంటే.. నేను ఏదో ఒక ప్రాంతానికి పరిమితమయ్యేవాడినన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను ఆదరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా బాబీతో చేయబోయే చిత్రం సంక్రాంతికి కానుకగా విడుదల కానున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టినట్టు చెప్పారు. ఈ సినిమాలో తాను తూర్పు గోదావరి యాసతో మాట్లాడనున్నట్టు చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు. మరోవైపు భోళా శంకర్ సమ్మర్ కానుకగా విడుదల కానున్నట్టు చెప్పారు. (Twitter/Photo)