Chiranjeevi Dupe : మెగాస్టార్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. 66 యేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా తనదైన డాన్సులతో నటనతో ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నారు. ఇక ఈయన చేసే రియల్ స్టంట్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు వయసు రీత్యా ఫైట్స్ విషయంలో అంతగా రిస్క్ తీసుకోవడం లేదు. ఇక చిరంజీవికి గత 30 యేళ్లుగా ఓ వ్యక్తి డూప్‌గా నటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
అయితే అంత రిస్కీ సీన్లు చేసినా ఇదివరకు వారి గురించి పెద్దగా ఎవ్వరికీ తెలిసేది కాదు. అయితే సోషల్ మీడియా విరివిగా వాడుతున్న ఈ కాలంలో డూప్‌ల గురించి కూడా బాగా తెలుస్తోంది. ఇక కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల నిర్వాహకులు వారిని లైమ్‌టైమ్‌లోకి తీసుకొస్తుండంతో హీరోల డూప్‌లకు ఇప్పుడు ఆదరణ బాగా లభిస్తోంది.
[caption id="" align="alignnone" width="1200"] కొన్ని ప్రాంతాలకు వెళ్లనున్న ఈ షో నిర్వాహకులు అక్కడి టాలెంట్‌ని బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ ఈ షోలోకి చిరంజీవి డూమ్ వచ్చారు. ఆయన పేరు ప్రేమ్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్లుగా చిరంజీవి డూప్‌గా చేస్తున్నారు. అంతేకాదు ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరిట ఆయనకు ఒక కంపెనీ ఉంది.
[caption id="attachment_1253442" align="alignnone" width="875"] ఇక షోలో వచ్చిన ఆయన.. రికార్డింగ్ డ్యాన్సర్లంటే చాలా చిన్న చూపు ఉన్న విషయం చెప్పుకొచ్చారు. వారికి ఆదరణ సరిగా లభించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ లాంటి వాళ్లకు ఒక ఫ్లాట్‌ఫామ్‌ని ఇస్తోన్న ఈటీవీ వారికి కృతఙ్ఞతలని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చారు.
[caption id="attachment_1220676" align="alignnone" width="400"] ఒకేసారి అరడజన్ సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్. రీసెంట్గా చిరు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసారు చిరంజీవి. చాలా రోజుల కిందే చిరును కలిసి కథ చెప్పాడు వెంకీ. అప్పుడే ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు. (Megastar Chiranjeevi Photo : Twitter)