Megastar Chiranjeevi | తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి. అప్పటికే ఎంతో మంది హీరోలున్న తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మెగాస్టార్‌గా ఎదిగారు. ఇక చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ప్రధానం ఎవరు చేసారంటే.. (Twitter/Photo)
చిరంజీవి, నిర్మాత కే.యస్.రామారావు కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘రాక్షసుడు’.యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే చిరంజీవి తమ్ముడు నాగబాబు నటుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. (Twitter/Photo)
ఈ చిత్రంలోనే తొలిసారి స్క్రీన్ పై చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు వచ్చి చేరింది. ఇది నిర్మాత కే.యస్.రామారావు చిరంజీవికి అందించిన అరుదైన బిరుదు అనే చెప్పాలి. అప్పటి వరకు సుప్రీం హీరో బిరుదుతో వస్తోన్న చిరంజీవి ఈ సినిమా తర్వాత పూర్తిస్థాయిలో తన పేరు ముందు మెగాస్టార్ చేర్చుకున్నారు. ఇపుడు చిరంజీవి ఫ్యామిలీ మెగాఫ్యామిలీగా మారడం వెనక ఉన్న అసలు వ్యక్తి ఈయనే. (Youtube/Credit)
చిరంజీవి, నిర్మాత కే.యస్.రామారావు కలయికలో వచ్చిన ఐదో చిత్రం ‘స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్’. ఈ చిత్రాన్ని రచయత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రం డిజాస్టర్ తర్వాత చిరంజీవి, కే.యస్.రామారావు కలయికతో మరో చిత్రం తెరకెక్కలేదు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతి, నిరోషా కథానాయికలుగా నటించారు. (Youtube/Credit)
చిరంజీవి, నిర్మాత కే.యస్.రామారావు కలయికలో మొత్తంగా ఐదు చిత్రాలు తెరకెక్కితే.. అందులో నాలుగు చిత్రాలు సక్సెస్ సాధిస్తే.. చివరి చిత్రం మాత్రం ‘స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్’. మాత్రం అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. ఇక ఈయనే చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ చేర్చారు. అంతేకాదు ఈయన సినిమాలు చిరంజీవి కెరీర్లో స్పెషల్‌గా నిలిచిపోయాయి. మొత్తంగా కె.యస్. రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ చిరంజీవికి ప్రత్యేక అనుబంధమే ఉంది. (Twitter/Photo)
దాదాపు 31 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవితో ఇపుడు ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. తమిళ బ్లాక్‌బస్టర్ వేదాళం సినిమాకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసాడు మెహర్. చాలా వేగంగా సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా భోళా శంకర్ తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లిగా నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమాతో చిరంజీవితో కే.యస్.రామారావు హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)