Chiranjeevi - Sai Dharam Tej | మెగాస్టార్ చిరంజీవి పేరుతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు పరిచయ్యారు. అందులో పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ అగ్ర హీరోలుగా రాణిస్తున్నారు. అటు చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన తండ్రి పంజా ప్రసాద్.. చిరంజీవితో ఓ చిత్రాన్ని నిర్మించారు. వివరాల్లోకి వెళితే.. (Twitter/Photo)
చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న పంజా ప్రసాద్ మెగాస్టార్‌తో ఓ సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. ఆ సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసిన ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్ వాళ్ల అన్న సంగతి చాలా మంది తెలియదు. ఇంతకీ మెగాస్టార్ చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న పంజా ప్రసాద్ నిర్మించిన ఆ సినిమా ఏంటో చూద్దాం. (Twitter/Photo)
తెరపై ఒక హీరో రెండు పాత్రల్లో కనిపించడం. ఆ రెండింటిలో ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ అయితే.. మరొకటి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. సిల్వర్ స్క్రీన్ పై ఎవర్ గ్రీన్ ఫార్ములా అనే చెప్పాలి. ఈ సందర్భంగా హీరోలు ఒకరి స్థానంలో మరొకరు వెళ్లడం. ఆయా సమస్యలను చక్కబెట్టడం అనేది సినిమాలో మూల కథాంశం ఇదే. ఆ కోవలో తెరకెక్కిన చిత్రం చిరంజీవి హీరోగా నటించిన ‘రౌడీ అల్లుడు’. ఈ సినిమా విడుదలై రీసెంట్గా 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. (Twitter/Photo)
ఎపుడో 140 ఏళ్ల క్రితమే మనుషులు పోలిన మనుషులు అనే ద్విపాత్రాభినయం అనే కాన్సెప్ట్‌కు బీజం పడింది. 1881లో వచ్చిన మార్క్ ట్వైన్ రచన ‘ప్రిన్స్ అండ్ పాపర్’ నాటి నుంచి ఈ ఫార్ములా సినిమాల్లో అప్లై చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాను తెలుగులో ఎన్టీఆర్, ఎస్వీఆర్ ముఖ్యపాత్రలో ‘రాజు బీద’గా కూడా తీశారు. ఇక తెలుగులో తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఏఎన్నార్ నటించిన ‘ఇద్దరు మిత్రులు’. ఇందులో హీరోలు ఒకళ్ల స్థానంలో మరొకరు వెళ్లి ఆయా సమస్యలను చక్కబెడతారు.
ఆ తర్వాత ఇదే ఫార్ములాతో ఎన్టీఆర్ హీరోగా ‘రాముడు భీముడు’ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా ద్విపాత్రాభినయం చిత్రాల్లో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. అంతేకాదు అలనాటి హీరోల నుంచి అప్ కమింగ్ హీరోలకు ఇదే సూపర్ హిట్ ఫార్ములాగా మారింది. ఆ కోవలో తెరకెక్కిన చిత్రం చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ సినిమా. (Twitter/Photo)
అలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన ద్విపాత్రాభియన చిత్రాల్లో ‘రౌడీ అల్లుడు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమా 31 యేళ్ల క్రితం 1991 అక్టోబర్ 18న విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి కళ్యాణ్గా, ఆటో జానీగా రెండు విభిన్న పాత్రల్లో ఇరగదీసారు. (Twitter/Photo)
‘గ్యాంగ్ లీడర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కింది. గ్యాంగ్ లీడర్ మూవీ విషయానికొస్తే.. యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ డ్రామా. ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనుకున్నారు. అందులో ద్విపాత్రాభినయంతో ఇద్దరు చిరంజీవిలతో కూడిన ఎంటర్టేనర్ సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు బీజం పడింది. పైగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తర్వాత కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. (Twitter/Photo)
‘గ్యాంగ్ లీడర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి తన సొంత వాళ్ల కోసం చేసిన సినిమా ‘రౌడీ అల్లుడు’. అల్లు అరవింద్ సమర్ఫణలో సాయి రాం ఆర్ట్స్ బ్యానర్లో చిరు తోడల్లుడు డాక్టర్ కే. వేంకటేశ్వరరావు, బావ గారైన పంజా ప్రసాద్ (సాయి ధరమ్ తేజ్ తండ్రి )ఈ సినిమాకు నిర్మాతలు. ఇక ఈ సినిమా నిర్మాణ బాధ్యతలన్ని అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాదు ఆ బ్యానర్లో తెరకెక్కిన ఏకైక చిత్రం ఇదే. (Twitter/Photo)
ఈ సినిమాలో చిరంజీవి సరసన శోభన, దివ్యభారతి నటించారు. ‘రుద్రవీణ’ తర్వాత శోభన చిరు సరసన నటించిన చిత్రం ఇదే. ఇక దివ్యభారతి.. మెగాస్టార్‌తో యాక్ట్ చేసిన ఏకైక చిత్రంగా ‘రౌడీ అల్లుడు’. అప్పట్లో దివ్య భారతి.. వెంకటేష్‌తో ‘బొబ్బలి రాజా’, మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ’ వంటి హిట్స్‌తో మంచి ఊపు మీదుండే. ఇక అప్పటికే రిలీజ్‌కు రెడీగా బాలకృష్ణ.. ‘ధర్మక్షేత్రం’లో కూడా దివ్యభారతి నటిస్తోంది. దీంతో దివ్యభారతిని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. (Twitter/Photo)
‘రౌడీ అల్లుడు’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో కోటీశ్వరుడైన కళ్యాణ్ ప్లేస్‌లో ఆయన మేనమామ ఆటోజానీకి తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో కళ్యాణ్గా.. అమలాపురం నుంచి బొంబేలో ఆటో డ్రైవర్‌గా స్థిర పడ్డ జానీ అలియాస్ జనార్ధన్గా రెండు పరస్పర విరుధ్ద పాత్రల్లో చిరంజీవి నటించాడనేకంటే జీవించారనే చెప్పాలి. రెండు పాత్రల్లో డైలాగ్, భాష, యాస అన్నింట్లో డిఫరెంట్ మేనరిజమ్స్ చూపించి నటనలో చిరు ఎందుకు మెగాస్టార్ అయ్యారో ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. (Twitter/Photo)
ఇక గ్యాంగ్ లీడర్’ సినిమాలో ‘రఫ్పాడిస్తా’ అనే డైలాగ్ ఎంతో ఫేమస్ అయిందో.. ‘రౌడీ అల్లుడు’ సినిమాలో ‘బాక్స్ బద్ధలైపోతుంది’ అనే డైలాగ్ చిరంజీవి ఊత పదంగా బాక్సాఫీస్ దగ్గర నిజంగానే బాక్సులు బద్ధలయ్యేలా చేసింది. ఆ తర్వాత అదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన ‘ఘరానా మొగుడు’ సినిమాలో ‘ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో’ వంటి డైలాగులు చిరంజీవి అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. వరుసగా చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ సినిమాలతో హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. (Twitter/Photo)
‘రౌడీ అల్లుడు’ సినిమాకు సత్యానంద్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. చిరంజీవి నటించిన గత సినిమాలైన ‘దొంగ మొగుడు’, యుముడికి మొగుడు’ ‘అత్తకు యుముడు అమ్మాయికి మొగుడు’ చిత్రాలను స్పూర్తిగా తీసుకొని సత్యానంద్ ఈ సినిమా స్టోరీ రెడీ చేసారు. దాన్ని రాఘవేంద్రరావు అంతే అద్భుతంగా తెరకెక్కించారు. డబుల్ రోల్, ప్లస్ అత్తామామల టీజింగ్ ఫార్ములాతో మెగాస్టార్ చిరంజీవి అంత కంటే అద్భుతంగా నటించి ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చారు. (Twitter/Photo)
‘రౌడీ అల్లుడు’ సినిమాలో అల్లు రామలింగయ్య చెప్పే ‘బొంబాయిలో అంతే.. బొంబాయలో అంతే’ అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. దాంతో పాటు బాక్స్ బద్ధలైపోతుంది అనే డైలాగుతో పాటు ‘ఫిప్టీ ఫిఫ్టీ’ అనే డైలాగులు ఫేమసయ్యాయి. ఒక దశలో ఈ సినిమాకు ‘ఫిఫ్టీ.. ఫీఫ్టీ’ అనే టైటిల్‌తో పాటు ‘ఆటో జానీ’ పేర్లు కూడా పరిశీలించారు. చివరగా ‘రౌడీ అల్లుడు’ టైటిల్ ఫిక్స్ చేశారు. (Twitter/Photo)
‘రౌడీ అల్లుడు’ తర్వాత చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ సినిమాకు కూడా ’లీడర్ రాజు’ అనే టైటిల్ అనుకున్నారు. ఒక వైపు చిరంజీవి రెగ్యులర్ ప్రొడ్యూసర్ ఒకప్పటి ఎన్టీఆర్ , ఆ తర్వాత బాలయ్య డేట్స్ చూసే నిర్మాత దేవీ వర ప్రసాద్‌తో ‘ఘరానా మొగుడు’ సినిమా సెట్స్ పైనే ఉంది. ఆ సినిమా చేస్తూనే చిరంజీవి ముందుగా ‘రౌడీ అల్లుడు’ సినిమాను కంప్లీట్ చేసారు. మరోవైపు రాఘవేంద్రరావు మోహన్ బాబుతో ‘అల్లరి మొగుడు’ సినిమా కూడా చేస్తున్నారు. ఇలా దర్శకేంద్రుడు మూడు సినిమాలను ఒకేసారి స్టార్ట్ చేయడం.. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్‌గా నిలవడం గమనార్హం. (Twitter/Photo)
‘రౌడీ అల్లుడు’ స్విట్టర్లాండ్‌లో షూటింగ్ జరుపుకున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇదే. కేవలం 25 మంది సభ్యులతో 12 రోజులు, రోజుకు 12 గంటల చొప్పున ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను పిక్చరైజ్ చేశారు. ఈ చిత్రానికి బప్పీలహరి అందించిన మ్యూజిక్ పెద్ద ఎస్సెట్. ఈ చిత్రంలో ఆరు పాటలు సూపర్ హిట్టైయి. అందులో శోభన, చిరంజీవిలపై ఒక పాట. దివ్య భారతితో నాలుగు పాటలు.. డిస్కో శాంతితో ఒక ఐటెం సాంగ్ ఉంది. ఈ సినిమా సూటింగ్ సామాగ్రిని అందరు ఓ చెయ్యి వేసి షూటింగ్ చేశారు. అక్కడ షూటింగ్ లోకేషన్లో చిరంజీవి సతీమణి అందరికీ వంట వండటం విశేషం. (Twitter/Photo)
1991 జూన్‌లో మొదలైన షూటింగ్ నాలుగు నెలల్లో పూర్తైయింది. ఈ సినిమా టోటల్‌గా రూ. 3.25 కోట్లు రాబట్టింది. ఈ సినిమా 56 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 21 కేంద్రాల్లో 100 రోజులు రన్ పూర్తి చేసుకుంది. 1992 జనబరి 26న నెల్లూరులోని అర్చన థియేటర్లో ఈ సినిమా 100 రోజుల వేడుకను నిర్వహించారు. ఈ వేడుకుక సినిమా నటీనటులతో పాటు దాసరి, విశ్వనాథ్ ముఖ్య అతిథులగా హాజరయ్యారు. జంధ్యాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక హైదరాబాద్ సుదర్శన్ 70MM థియేటర్లో ఈ సినిమా విడుదల కోసం 23 వారాలకే గ్యాంగ్ లీడర్ మూవీని తీసేసారు. అలా గ్యాంగ్ లీడర్ సిల్వర్ జూబ్లీ మిస్ చేసుకుంది. (Twitter/Photo)
మొత్తంగా సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న పంజా ప్రసాద్ వాళ్ల ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవితో నిర్మించిన ‘రౌడీ అల్లుడు’ సినిమా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పంజా ప్రసాద్ మరో సినిమా నిర్మించలేదు. మొత్తంగా ‘రౌడీ అల్లుడు’ సినిమా మెగాస్టార్ అభిమానులకు ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. (Twitter/Photo)