నిజానికి ఈ ప్రచారానికి ఊతమిచ్చిందే శ్రీజ. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కళ్యాణ్ పేరుని తొలగించి అనుమానాలు రేకెత్తించింది చిరు డాటర్. దీంతో అప్పటినుంచి శ్రీజ, కళ్యాణ్ డివోర్స్ టాపిక్ వార్తల్లో నిలుస్తోంది. దీనికి తోడు చిరంజీవి ఇంట జరుగుతున్న చిన్న చిన్న ఫంక్షన్స్‌లో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం జనాల్లోని అనుమానాలకు రెక్కలు కట్టింది.
నా గురించి బాగా తెలిసిన వ్యక్తి.. నన్ను అమితంగా ప్రేమిస్తూ ఎప్పుడూ కేరింగ్‌గా చూసుకునే వ్యక్తి.. కష్టసుఖాల్లో నాకు సపోర్టివ్‌గా ఉండే వ్యక్తి.. ఆ వ్యక్తి మరెవరో కాదు.. నేనే అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది శ్రీజ. చివరకు నిన్ను నేను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇక కొత్త ప్రయాణం మొదలు అంటూ చిరంజీవి డాటర్ పోస్ట్ చేయడం కొత్త చర్చలకు తెరలేపినట్లయింది.