God Father: గాడ్ ఫాదర్ ఫైనల్ కాపీ చూసేసిన చిరంజీవి.. సినిమాపై ఆయన ఫీలింగ్స్ ఇవే!
God Father: గాడ్ ఫాదర్ ఫైనల్ కాపీ చూసేసిన చిరంజీవి.. సినిమాపై ఆయన ఫీలింగ్స్ ఇవే!
Chiranjeevi: లూసీఫర్ తెలుగు రీమేక్ గా భారీ హంగులు జోడించి గాడ్ ఫాదర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫైనల్ కాపీ చూసిన చిరంజీవి తన ఒపీనియన్ చెప్పారట.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్ (God Father). మలయాళ చిత్రం లూసీఫర్ తెలుగు రీమేక్ గా భారీ హంగులు జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
2/ 8
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాత్ స్టార్ హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తోంది.
3/ 8
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా గాడ్ ఫాదర్ మూవీ టీజర్‌ను ఈ నెల 21న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి.
4/ 8
అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ ఫుట్ పుట్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ ఫైనల్ కాపీని మెగాస్టార్ చిరంజీవి చూశారని ఇన్ సైడ్ టాక్.
5/ 8
గాడ్ ఫాదర్ ఫైనల్ కాపీని మెగాస్టార్ తన ఇంట్లోనే వీక్షించారని చెబుతున్నారు. ఈ కాపీ చూసిన తర్వాత మెగాస్టార్ బాగా ఎక్సైట్ అయ్యారని తెలుస్తోంది. సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ తో చెప్పారట. గాడ్ ఫాదర్ చూసిన వెంటనే దర్శకుడు మోహన్ రాజాను చిరంజీవి ప్రశంసించినట్లు సమాచారం.
6/ 8
ఈ భారీ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్ భాగం కావడంతో మెగా ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో అంతకుమించిన హిట్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు.
7/ 8
ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ లో చిరంజీవి రఫ్‌లుక్‌తో మెగా లోకాన్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించారు. చిరంజీవికి చెల్లెలుగా నయనతార కనిపించనుంది.
8/ 8
రీసెంట్ గా వచ్చిన చిరంజీవి మూవీ ఆచార్య డిజాస్టర్ కావడంతో కాస్త నిరాశ చెందిన మెగా ఫ్యాన్స్‌కి ఈ గాడ్ ఫాదర్ సినిమా బూస్టింగ్ ఇస్తుందని ఫిలిం నగర్ మాట. సర్వ హంగులతో అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా ఈ సినిమాను రూపొందించారని టాక్. ఈ మూవీలో ఖైదీ గెటప్‌లో చిరంజీవి కనిపించబోతున్నారు.