ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022 (International Film Festival of India) అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పురస్కారాన్ని అందుకోవడానికి చిరంజీవి గోవాలో జరుగుతున్న ఇఫీకి వెళ్లారు చిరంజీవి. ఈ అవార్డు అందుకున్న మెగాస్టార్ వేదికపై భావోద్వేగానికి గురయ్యారు.
ఈ అవార్డు తన అభిమానుల్లో నూతనోత్సాహం నింపిందని చిరంజీవి అన్నారు. నేను ఎప్పుడూ మీతోనే ఉంటా.. నా చివరి శ్వాస వరకు సినిమాల నుంచి తప్పుకోనని చెప్పారు చిరంజీవి. తెలుగు ప్రజల ప్రేమనే తనను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని తెలిపారు. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు మెగాస్టార్.