Chiranjeevi : బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్.. ఈ రోజు (శనివారం) హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌లో ఉన్న చిరంజీవి ఛారిటిబల్ ట్రస్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌తో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ ద్వారా చిరు నిర్వహిస్తోన్న రక్త దానం, నేత్ర దానం గురించి తెలుసుకున్నారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎక్కువగా రక్త దానం చేసిన రక్త దాతలకు ఫ్రీ యాక్సిడెంటల్ పాలసీని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ చేత చిరంజీవి అందజేసారు. ఈ సందర్భంగా బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ తన ఛారిటబుల్ ట్రస్ట్‌కు అడిగిన వెంటనే రావడాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. (Twitter/Photo
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి .. ఓ మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా ఈ ఛారిటబుల్ ట్రస్ట్ ఎలా నిర్వహిస్తున్నారనేది స్వయంగా పరీశీలించి తెలుసుకున్నారు. చిరు విషయానికొస్తే.. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఈయన్ని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా.
ఈ అవార్డును చిరంజీవి.. కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులు మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నెమలి చిత్రం కలిగిన రజత పతకం, రూ.10 లక్షలు, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. చిరు సహా ఇప్పటి వరకూ ఈ అవార్డును వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీమ్ ఖాన్, విశ్వజిత్ ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్ జోషి అందుకున్నారు.
కేంద్రం ప్రతి యేడాది సినీ రంగంలో తమదైన ప్రతిభ చూపించిన వాళ్లకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇస్తూ వస్తోంది. దీంతో పాటు భారత దేశంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2013 నుంచి ఇస్తూ వస్తోంది. భారతీయ సినిమా 100 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మన దేశంలో సినీ రంగంలో కృషి చేసిన వాళ్లకు ఈ అవార్డు ఇస్తూ వస్తోంది.2013లో 44వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నుంచి ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. తొలి అవార్డును వహీదా రహమాన్ అందుకున్నారు. తాజాగా ఈ 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా చిరంజీవి ఈ అవార్డు అందుకున్నారు.
చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది ఆచార్యతో భారీ ఫ్లాప్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ’గాడ్ ఫాదర్’ మూవీకి గుడ్ టాక్ వచ్చినా.. ఆశించిన మేర వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. త్వరలో ఈయన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో పలకరించనుంది. ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్టు సమాచారం. (Twitter/Photo)
ఈ అవార్డు తన అభిమానుల్లో నూతనోత్సాహం నింపిందని చిరంజీవి అన్నారు. నేను ఎప్పుడూ మీతోనే ఉంటా.. నా చివరి శ్వాస వరకు సినిమాల నుంచి తప్పుకోనని చెప్పారు చిరంజీవి. తెలుగు ప్రజల ప్రేమనే తనను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని తెలిపారు. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చిరు ప్రత్యేక ధన్యవాదాలు తెలిసిన సంగతి తెలిసిందే కదా.(Twitter/Photo)