మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సంక్రాంతికి మెగా మాస్ ట్రీట్ రానుంది. ఈ సందర్భంగా టీం ప్రమోషన్లను జోరు పెంచింది. ఇందులో భాగంగానే... ఆదివారం రాత్రి వైజాగ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాచు, ఈ సందర్భంగా విశాఖపై తనకున్న ప్రేమను చాటుకున్నారు చిరంజీవి.
ఇది విశాఖలోని ఒక జాలరి గూడెం నేపథ్యంలో నడిచే కథ. ఆ గూడెం ప్రజల తరఫున నిలబడి, అవినీతినీ .. అన్యాయాన్ని ప్రశ్నించే నాయకుడిగా చిరంజీవి పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నారు. రవితేజ కీలకమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో, శృతిహాసన్‌తో పాటు మరో హీరోయిన్ కేథరిన్ .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
వాల్తేరు వీరయ్య ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా బాస్ మాస్ డైలాగ్స్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చిరంజీవి సర సన నాయికగా శ్రుతి హాసన్ నటించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను జనవరి 7న రిలీజ్ చేశారు. మెగాస్టార్ మార్క్ యాక్షన్ .. కామెడీ .. రొమాన్స్ .. మాస్ స్టెప్పులు .. పవర్ఫుల్ డైలాగ్స్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.