కీర్తి సురేష్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. అంతకు ముందు రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజా’ మూవీతో తెరంగేట్రం చేసింది. ఇక మహానటి సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇటీవల తెలుగులో కీర్తి రంగ్ దే అనే సినిమాలో నటించింది. ఆసినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కీర్తి ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తేలో చెల్లెలి పాత్రలో అలరించింది. మరోవైపు హీరోగా తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ సినిమాలో చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ భర్త పాత్రలో క్రేజీ హీరోగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. (Twitter/Photo)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యతో పాటు మలయాళీ లూసీఫర్ రీమేక్ చిత్రం ‘గాడ్ ఫాదర్’ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాకు చిరు కొబ్బరికాయ కొట్టారు. (Twitter/Photo)
‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోన్న రూ. 2 కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. ఈ రకంగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న తమన్నా కంటే కీర్తి సురేష్‌కు ఎక్కువ పారితోషకం ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా చిరంజీవి.. తమన్నాకు రెమ్యునరేషన్ విషయంలో అన్యాయం చేసారనేది హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కంటే చెల్లెలు పాత్రకే ఇంపార్టెన్స్ ఉంది. అందుకే మహానటి కీర్తి సురేష్‌ను ఎక్కువ పారితోషకం ఇచ్చినట్టు సమాచారం. (Twitter/Photo)
భోళా శంకర్ ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అనిల్ సుంకరతో కలిసి కే.యస్.రామారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారని.. ముఖ్యంగా గుండుతో కనిపించనున్నారు. చిరంజీవితో ఎన్నో మెమరబుల్ హిట్స్ అందించిన కే.యస్.రామారావు.. దాదాపు 30 యేళ్ల తర్వాత చిరంజీవితో సినిమా నిర్మిస్తుండటం విశేషం. (Twitter/Photo)