మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యతో పాటు మలయాళీ రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది. తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఇటీవల విడుదలైంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి. Photo : Twitter
కాగా ఈరోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమంలో చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గోన్నారు. ఇక ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు విభిన్నమైన లుక్లో కనిపించనున్నారని.. ముఖ్యంగా గుండుతో కూడా కనిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇక చిరంజీవి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. Photo : Twitter
చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God Father) అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుగుతోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter