దక్షిణాది హీరోలు ఏజ్ 60 దాటినా.. ఇప్పటికీ హీరోలుగా సత్తా చూపెడుతూనే ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ కూడా ఏజ్ 60 దాటినా మనవళ్లు పుట్టినా... కుర్ర హీరోలతో పోటీ పడ్డారు. ఈ జనరేషన్లో చిరంజీవి, బాలకృష్ణ, తమిళనాట రజినీకాంత్‌లకు మనవళ్లు, మనవరాళ్లు పుట్టినా.. ఇప్పటికీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఇక హీరో విక్రమ్ కూడా తాతగా ప్రమోషన్ పొందారు. ఈయన కూతురు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో హీరోగా నటిస్తూ.. తాత అయిన హీరోల లిస్టులో ఇతను చేరాడు. కానీ లోక నాయకుడు కమల్ హాసన్ మాత్రం ఆ విషయంలో వెనకబడ్డారు. మొత్తంగా తాతగా ప్రమోషన్ పొందిన హీరోలు ఇంకెవరున్నారంటే.. (Twitter/Photo)
చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో పాటు కుటుంబంతోనూ సమయం గడుపుతున్నాడు. సైరా తర్వాత పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నాడు ఈయన. తాజాగా ఈయన తన చిన్న కూతురు శ్రీజ కూతురుతో దిగిన.. chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi grand daughter,chiranjeevi navishka,chiranjeevi srija kalyan,chiranjeevi daughter,chiranjeevi koratala siva,telugu cinema,chiranjeevi grand daughter birthday,చిరంజీవి,చిరంజీవి మనవరాలు,మనవరాలితో చిరంజీవి,తెలుగు సినిమా" width="875" height="583" /> చిరంజీవి ఎపుడో తాత అయ్యాడు. తాతగా ప్రమోషన్ పొందిన హీరోగా సత్తా చాటుతూనే ఉన్నారు. అంతేకాదు వరస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇక చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ’గాడ్ ఫాదర్’,తో పాటు ‘భోళా శంకర్’తో పాటు బాబీ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. (Twitter/Photo)
ఎన్టీఆర్,ఏఎన్నార్ కూడా తాతగా ప్రమోషన్ పొందినా.. కూడా బాక్సాఫీస్ దగ్గర హీరోలుగా సత్తా చాటారు. అప్పట్లో నందమూరి, అక్కినేని 60లలో కూడా హీరోలుగా ఎలా చూసారా అనే డౌట్స్ ఉండేవి. ఇప్పటి జనరేషన్ వాళ్లకు. కానీ ఇపుడున్న హీరోలను చూసిన తర్వాత వాళ్ల స్టార్ రేంజ్ ఏంటనేది చాలా మందికి తెలిసొచ్చింది. (File/Photo)
కమల్ హాసన్ విషయానికొస్తే.. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పటికే కథానాయికలుగా సత్తా చూపెడుతునే ఉన్నారు. వాళ్లకు పెళ్లీళ్లు కాలేదు కాబట్టి.. కమల్ హాసన్.. తాతగా ప్రమోషన్ పొందలేకపోయారు. ఏమైనా ఆయన తోటి కథానాయకులందరు తాతగా ప్రమోషన్ పొంది సత్తా చూపెడుతుంటే.. లోక నాయకుడు మాత్రం కామ్‌గా తన సినిమాలేవో చేసుకుంటూ వెళుతున్నారు. (Twitter/Photo)