ఉప్పు లేని పప్పు..మసాలా లేని కూర ఎలా అయితే.. తినడానికీ ఇష్టపడమో...అలాగే హీరోయిన్ లేకుండా హీరోను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ మటుకు ఇష్టపడరు. అయితే కథానాయిక లేకున్నా...కథలో బలముంటే సినిమా సక్సెస్ అవుతుందన్న విషయాన్ని అప్పడపుడు మన హీరోలు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఈ రకంగా కథానాయిక లేకుండా సింగిల్‌గా నటించిన హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్‌తో పాటు చాలా మంది హీరోలున్నారు. (File/Photos)
తాజాగా బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ మూవీలో టైటిల్ పాత్రధారికి కథానాయిక లేదు. భాలయ్య ఇప్పటి వరకు డ్యూయల్ రోల్లో ఎన్ని సినిమాల్లో చేసినా అన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలకు కథానాయికలున్నారు. కానీ ఈ సినిమాలో కథ ప్రకారం ఉండకూడదు. ఇంకో పాత్రకు కథానాయిక ఉంది. బాలయ్య ‘అఖండ’ను హీరోయిన్ లేకుండా నటించిన సినిమాగా పరిగణించలేము.(Twitter/Photo)
రామారావు విషయానికొస్తే...అప్పట్లో ఎన్టీఆర్ ‘భీష్మ’ వంటి పౌరాణిక సినిమాలతో పాటు ఇంకొన్ని మూవీస్‌లో కథానాయిక లేకుండానే ఆడియన్స్ ను అలరించారు. ఏమైనా ఎఫుడు హీరోయిన్స్‌తో యుగళ గీతాలు పాడుకుంటూ టైమ్ పాస్ చేసే హీరోలు... గ్లామర్ మీదనే ఆధారపడకుండా కథాబలంతో సక్సెస్ అందుకోవచ్చని ఆయా సినిమాలతో ప్రూవ్ చేసారు. (Youtube/Credit)