తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాతో మరో హీరో సినిమా పోటీ పడటం అనేది ఎప్పటి నుంచో ఉంది. అందులో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీ అంటే అభిమానులకు ఆ మజాయే వేరు. వీళ్లిద్దరు ఐదేళ్ల తర్వాత మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనడానికీ రెడీ అవుతున్నారనే ముచ్చట ఫిల్మ్ సర్కిల్స్‌లో వినబడుతోంది. (Twitter/Photo)
తాజాగా హీరోగా మలయాళంలో మోహన్‌లాల్ నటించిన లూసీఫర్ చిత్రాన్ని ‘గాడ్ ఫాదర్’ మూవీ టైటిల్‌తో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక మలయాళంలో సూపర్ హిట్టైన లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే చిత్రాన్ని తెలుగులో ఇపుడు మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో చిరు హీరోగా రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. అంతేకాదు ఈ చిత్రాన్ని విజయ దశమి కానుగా విడుదల చేస్తున్నట్టు కన్ఫామ్ చేశారు. దాదాపు ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. మరోవైపు బాలయ్య హీరోగా మలినేని దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం దసరా బరిలో ఉంటుందనే టాక్ వినబడుతోంది. (Twitter/Photo)
గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి తనకు అచ్చొన్చిన ఖైదీ పాత్రలో కనిపంచబోతున్నారు. గతంలో వచ్చిన ‘ఖైదీ, ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 సినిమాలు సక్సెస్ అయ్యాయి. అదే కోవలో ఖైదీ గెటప్‌లో చిరంజీవి కనిపించనున్న ఈ సినిమా సెంటిమెంట్ ప్రకారం బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని అభిమానులు అపుడే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సినిమాను దసరా బరిలో సెప్టెంబర్ 30న విడుదలయ్యే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
మరి బాలయ్య కూడా తన 107 చిత్రాన్ని కూడా చిరంజీవి పోటీగా విజయ దశమికి పోటీలో నిలుపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. గత 40 యేళ్లుగా వీళ్లిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూనే ఉన్నారు. మరి ఈ సారి కూడా ఈ బడా సీనియర్ స్టార్స్ బాక్పాఫీస్ దగ్గర సై అంటారా అనేది చూడాలి. మొత్తంగా వీళ్లిద్దరు ఎన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారనే విషయానికొస్తే.. (Twitter/Photo)
అయితే బాక్సాఫీస్ దగ్గర ఎంత మది హీరోలు పోటీ పడినా కానీ, చిరంజీవి బాలకృష్ణ బరిలో ఉంటే ఆ కిక్కే వేరప్ప. టాకీస్ల దగ్గర సందడి, అభిమానుల హడావుడి వేరుగా ఉంటుంది. ఎవరు హిట్ కొట్టారు ? ఎవరు బొక్క బోర్లా పడ్డారు లాంటి టాక్ తో అదో రకమైన సందడి ఉంటుంది. వీళ్లిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడిన సినిమాల విషయానికొస్తే..
1. జననీ జన్మభూమి - ఛాలెంజ్ | మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహా బాలకృష్ణ తొలిసారి 1984లో 27 జూలై 1984లో జననీ జన్మభూమి సినిమాతో బాలయ్య పోటీలో నిలిస్తే.. చిరంజీవి రెండు వారాల గ్యాప్‌తో 9 ఆగష్టు చాలెంజ్ మూవీతో పలకరించారు. తొలిసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డ చిరు, బాలయ్య సినిమాల్లో జననీ జన్మభూమి ఫ్లాప్‌గా నిలిస్తే.. చిరంజీవి.. చాలెంజ్ మూవీతో హిట్ అందుకున్నారు. (File/Photo)
2. మంగమ్మ గారి మనవడు - ఇంటి గుట్టు | బాలకృష్ణ, చిరంజీవి రెండో సారి 1984లోనే పోటీ పడ్డారు. ఆ యేడాది 7 సెప్టెంబర్ 1984లో బాలయ్య.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాతో పోటీపడితే.. చిరంజీవి.. బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటి గుట్టు మూవీతో ఒక వారం గ్యాప్‌లో 14 సెప్టెంబర్ 1984లో బరిలో దిగారు. ఈ పోటీలో చిరంజీవి ఇంటిగుట్టు యావరేజ్‌గా నిలిస్తే.. బాలయ్య ‘మంగమ్మ గారి మనవడు’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సారి పోటీలో చిరుపై బాలయ్య పై చేయి సాధించాడు. (File/Photo)
3. అగ్న గుండం - శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర | 1984లో మూడోసారి చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర సై అన్నారు. ఆ సారి చిరంజీవి క్రాంతి కుమార్ దర్శకత్వంలో 1984 నవంబర్ 23న ‘అగ్ని గుండం’ సినిమాతో పలకరించారు. ఈ మూవీకి ఒక వారం గ్యాప్‌లో 1984 నవంబర్ 23న బాలకృష్ణ, తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసిన నటించిన శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రతో పలరించారు. ఈ పోటీలో చిరు.. అగ్నిగుండం ఫ్లాప్‌గా నిలిస్తే.. శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ పోటీలో చిరుపై మరోసారి బాలకృష్ణ గెలిచారు. (File/Photo)
4. కథానాయకుడు - రుస్తుం | 1984లో నాల్గోసారి బాక్సాఫీస్ బరిలో సై అంటే సై అన్నారు బాలకృష్ణ, చిరంజీవి. ఈ సారి నందమూరి బాలకృష్ణ.. సురేష్ ప్రొడక్షన్స్‌లో కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో ’కథానాయకుడు’ మూవీతో 1984 డిసెంబర్ 14 పలకరిస్తే.. చిరంజీవి.. 1984 డిసెంబర్ 21న చిరంజీవి హీరోగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుస్తుం’ మూవీతో పలకరించారు. ఈ పోటీలో కథానాయకుడు సూపర్ హిట్‌గా నిలిస్తే.. రుస్తుం మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ పోటీలో కూడా చిరుపై బాలయ్య పై చేయి సాధించారు. (File/Photo)
5.ఆత్మ బలం - చట్టంతో పోరాటం | 1985ల చిరంజీవి ‘‘చట్టంతో పోరాటం’’ మూవీతో జనవరి 5న .పలకరించారు. ఆ తర్వాత ఒక వారం గ్యాప్‌లో 11 జనవరిన బాలకృష్ణ ‘‘ఆత్మబలం’’ సినిమాతో ఢీ కొట్టినుండే. ఇక సంక్రాంతి సీజన్లో పోటీ పడటం ఫస్ట్ టైం. ఓవరాల్‌గా మాత్రం 5వ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. ఈ పోటీలో చిరు చట్టంతో పోరాటం హిట్‌గా నిలిస్తే.. బాలయ్య ‘ఆత్మ బలం’ మూవీ మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సారి బాలయ్య మీద చిరునే పై చేయి సాధించారు.
6. కొండవీటి రాజా - నిప్పులాంటి మనిషి | ఇక 1986లో చిరంజీవి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొండవీటి రాజాతో జనవరి 31న పలకరించారు. మరోవైపు బాలయ్య ఒకవైపు గ్యాప్‌లో ‘నిప్పులాంటి మనిషి’తో ఫిబ్రవరి 7 బాలయ్య బాక్సాఫీస్ బరిలో దిగారు. ఈ పోటీలో చిరంజీవి.. కొండవీటి రాజా మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిస్తే.. బాలయ్య ‘నిప్పలాంటి మనిషి మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సారి మాత్రం బాలయ్య పై చిరంజీవి పై చేయి సాధించారు. (File/Photo)
7. రాక్షసుడు - అపూర్వ సహోదరులు | 1986 అక్టబర్ 2న చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘రాక్షసుడు’ మూవీతో పలకరించారు. ఈ మూవీ విడుదైలన ఒక వారం గ్యాప్‌లో నందమూరి బాలకృష్ణ, కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ సహోదరులు’ మూవీతో పలకరించారు. ఈ పోటీలో చిరంజీవి.. రాక్షసుడు సూపర్ హిట్‌గా నిలిస్తే.. బాలయ్య.. అపూర్వ సహోదరులు మూవీ మాత్రం హిట్‌గా నిలిచింది. ఈ సారి పోటీలో చిరంజీవి, బాలయ్య ఇద్దరు హిట్ అందుకున్నారు. (File/Photo)
8. దొంగ మొగుడు - భార్గవ రాముడు |1987 సంక్రాంతి సీజన్లో వన్ వీక్ గ్యాప్ లో చిరుంజీవి 7 జనవరి రోజున ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘దొంగమొగుడు’ మూవీతో పలకరించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అటు బాలకృష్ణ జనవరి 14న ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘భార్గవ రాముడు’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఒక దర్శకుడి డైరెక్షన్లో వీళ్లిద్దరు నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక సంక్రాంతి సీజన్లో వీళ్లిద్దరు పోటీ పడ్డ రెండో చిత్రం. (Twitter/Photo)
9. రాము - పసివాడి ప్రాణం | 1987లో జూలై 23న చిరంజీవి.. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘పసివాడి ప్రాణం’ మూవీతో పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మరోవైపు బాలయ్య.. ఒక వారం గ్యాప్‌లో జూలై 31న డి.రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్‌లో వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో ‘రాము’ సినిమాతో పలకరించారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ రకంగా చిరంజీవి, బాలకృష్ణ ఈ పోటీలో హిట్ అందుకున్నారు. (File/Photo)
10.మంచి దొంగ - ఇన్స్పెక్టర్ ప్రతాప్ | 14 జనవరి 1988లో చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచిదొంగ గా మురిపిస్తే..బాలకృష్ణ ఒక రోజు గ్యాప్‌లో 15 జనవరి 1988న ‘ఇన్ స్పెక్టర్ ప్రతాప్’ గా పలకరించారు. ఇందులో చిరంజీవి మంచి దొంగగా హిట్ అందుకుంటు.. బాలయ్య.. ఇన్స్పెక్టర్ ప్రతాప్ యావరేజ్‌గా నిలిచింది. ఈ సారి పోటీలో బాలయ్యపై చిరు కొంచెం పై చేయి సాధించారు. (File/Photo)
11. యుద్ధ భూమి - రాముడు భీముడు | 1988 నవంబర్ 11 కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘యుద్ధ భూమి’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిస్తే.. ఈ మూవీకి ఒక వారం గ్యాప్‌లో నవంబర్ 17న కే.మురళీ మోహన రావు దర్శకత్వంలో బాలయ్య ‘రాముడు భీముడు’ మూవీతో పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ సారి బాక్సాఫీస్ పోరులో చిరుపై బాలయ్య కొంచెం పై చేయి సాధించారు. (File/Photo)
12. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు - భలే దొంగ | ఆ తర్వాతి సంక్రాంతికి బాలయ్య భలేదొంగగా జనవరి 15న పలకరిస్తే.. మురిపిస్తే...చిరు మాత్రం జనవరి 14 ‘‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’’గా మెప్పించారు. ఇందులో చిరు.. అత్తకు యుముడు అమ్మాయికి మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిస్తే.. బాలయ్య ‘భలే దొంగ’ గా మురిపించారు. ఈ సారి పోటీలో ఇద్దరికీ సక్సెస్ అందుకున్నా.. బాలయ్యపై చిరు ఒకింత పై చేయి సాధించారనే చెప్పాలి. (File/Photo)
13. పెద్దన్నయ్య - హిట్లర్ | 1997 సంక్రాంతి సీజన్లో చిరంజీవి.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో జనవరి 4 పలకరించారు. అటు ఈ సినిమా విడుదలైన వారం గ్యాప్‌లో జనవరి 10న శరత్ దర్శకత్వంలో ‘పెద్దన్నయ్య’ గా పలకరించారు. ఇందులో చిరంజీవి ‘హిట్లర్’గా హిట్ అందుకున్నారు. అటు పెద్దన్నయ్యగా సక్సెస్ అందుకున్నారు. ఈ సారి పోటీలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు సక్సెస్ అందుకున్నారు. (File/Photo)
14.సమరసింహారెడ్డి - స్నేహం కోసం | 1999 జనవరి 1న కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చిరంజీవి ‘స్నేహం కోసం’ మూవీతో పలకరించారు. ఈ మూవీ బాక్సాపీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. మరోవైపు రెండు వారాల గ్యాప్‌లో సంక్రాంతి కానుకగా జనవరి 13న బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘సమరసింహారెడ్డి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సారి పోటీలో చిరంజీవిపై బాలయ్య పై సాధించారు. (File/Photo)
15.అన్నయ్య - వంశోద్ధారకుడు | 2000 జనవరి 4న చిరంజీవి.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘అన్నయ్య’గా ఆకట్టుకున్నారు. మరోవైపు 10 రోజుల గ్యాప్‌తో బాలయ్య జనవరి 14న శరత్ దర్శశకత్వంలో ‘వంశోద్దారకుడు’ తో పలకరించారు. ఈ సారి పోటీలో అన్నయ్యగా చిరంజీవి హిట్ అందుకుంటే.. బాలయ్య.. ‘వంశోద్దారకుడు’ మూవీతో ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఈ సారి పోటీలో బాలకృష్ణపై చిరంజీవి పై చేయి సాధించారు. (File/Photo)
16. మృగరాజు - నరసింహనాయుడు | 2001లో జనవరి 11న మెగాస్టార్ చిరంజీవి.. గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన ‘మృగరాజు’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిస్తే.. అదే రోజు విడుదలైన బాలకృష్ణ, బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నరసింహనాయుడు’ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సారి పోటీలో చిరంజీవిపై బాలకృష్ణ పై చేయి సాధించారు. (File/Photo)
17. శ్రీమంజునాథ - భలేవాడివి బాసూ | 2001 జూన్ 15న నందమూరి నట సింహం .. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో చేసిన ‘భలేవాడివి బాసూ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి ఒక వారం గ్యాప్‌లో విడుదలైన చిరంజీవి, అర్జున్ హీరోలుగా కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘శ్రీమంజునాథ’ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఈ సారి పోటీలో బాలయ్య పై చిరంజీవి పై చేయి సాధించారు. (File/Photo)
18. లక్ష్మీ నరసింహా - అంజి | నందమూరి బాలకృష్ణ.. 2004లో సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘లక్ష్మీ నరసింహా’ మూవీతో పలకరించి హిట్ అందుకున్నారు. మరోవైపు ఒక రోజు గ్యాప్‌లో చిరంజీవి హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంజి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సారి మాత్రం మెగాస్టార్ పై నట సింహం పై చేయి సాధించారు. (File/Photo)
ఖైదీ నంబర్ 150 - గౌతమిపుత్ర శాతకర్ణి | మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘ఖైదీ నంబర్ 150’ . 11 జనవరి 2017న విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మరోవైపు 12 జనవరిన క్రిష్ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్పాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు సూపర్ హిట్స్ అందుకున్నారు. (File/Photo)
తాజాగా చిరంజీవి హీరోగా మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ మూవీని తెలుగులో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. విజయ దశమికి రిలీజ్ అన్నట్టు ప్రకటించినా.. డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఒకవేళ చేస్తే ఈ సినిమాను సెప్టెంబర్ 30న కానీ.. అక్టోబర్ 5న కానీ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోపక్క బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని కూడా అక్టోబర్ 5న విడుదల చెయ్యడానికి ఆ చిత్ర బృందం సన్నాహాలు చేస్తునట్టు సమాచారం..ఇలా ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవుతున్నాయంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత వస్తుంటే.. నందమూరి నటసింహా బాలకృష్ణ అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు సినిమాలు పోటీ పడితే ఎవరు గెలుస్తారు అని ఇప్పటి నుంచే అందరు పందాలు వేసుకుంటున్నారు. ఇరువురి హీరోల అభిమానుల మధ్య ఇప్పటి నుండే రగడ మొదలైంది. మరి ఈ ఇద్దరు బడా హీరోల్లో చిరు తన బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. మరి బాలయ్య దసరా బరిలో పోటీకి సై అంటారా .. ? లేకపోతే వేరే డేట్లో రంగంలోకి దిగుతారా.. ? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..(File/Photo)