మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ టైటిల్‌తో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక మలయాళంలో సూపర్ హిట్టైన లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే చిత్రాన్ని తెలుగులో ఇపుడు మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో చిరు హీరోగా రీమక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ఈ లుక్‌లో చిరంజీవి తన ఏజ్‌కు తగ్గ పాత్రలో కనిపించడం విశేషం. (File/Photo)
గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి తనకు అచ్చొన్చిన ఖైదీ పాత్రలో కనిపంచబోతున్నారు. గతంలో వచ్చిన ‘ఖైదీ, ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 సినిమాలు సక్సెస్ అయ్యాయి. అదే కోవలో ఖైదీ గెటప్‌లో చిరంజీవి కనిపించనున్న ఈ సినిమా సెంటిమెంట్ ప్రకారం బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని అభిమానులు అపుడే లెక్కలు వేసుకుంటున్నారు. (Twitter/Photo)
‘ఆచార్య’ మాదిరే ఈ సినిమాలో కూడా చిరంజీవి.. హీరోయిన్ లేకుండా సింగిల్‌గానే ఈ సినిమాలో రఫ్పాడించనున్నారు. పూర్తిగా సీరియర్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను చిరు ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎపుడు విడుదల చేసేది మాత్రం చెప్పలేదు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. (Twitter/Photo)
‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ల మధ్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని చెబుతున్నారు. ఆ సన్నివేశాలు ఈ సినిమాలో కీలకం కానున్నాయి. కేవలం చిరంజీవి కోసమే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరుతో సల్మాన్ ఖాన్ స్టెప్పులు ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉంటుందని చెబుతున్నారు. (Twitter/Photo)
ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తొలిసారి దక్షణాదిలో నటిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారు. ఆ చనువుతో ఇపుడు చిరు మూవీతో డైరెక్ట్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. (Twitter/Photo)
ఇక ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్లోకి వచ్చింది. ఫైనల్‌గా సల్మాన్ ఖాన్‌తో ఈ రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. (Twitter/Photo)
ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో నయనతార యాక్ట్ చేస్తోంది ఇక ఈ చిత్రంలో సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు చిరంజీవి మెహర్ రమేష్‌తో ‘భోళా శంకర్’, బాబీతో వాల్తేరు వీరయ్య’ సినిమాలతో పాటు వెంకీ కుడుమలతో సినిమాలకు ఓకే చెప్పారు. తాజాగా మారుతి దర్శకత్వంలో చేస్తానని మాట ఇచ్చారు. Twitter/Photo)